బాలీవుడ్ స్టార్ అజయ్‌దేవ్‌గన్ తాజా చిత్రం బాద్షాహో. మిలాన్ లుథ్రియా డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అజయ్‌దేవ్‌గన్ నిన్న తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఇక తాజాగా చిత్రంలోని తన లుక్ ని రివీల్ చేశాడు స్టార్ హీరో అజయ్. ఇందులో ఇంటెన్స్ లుక్ తో కనిపిస్తుండగా , అభిమానులు సినిమాపై భారీ ఊహాగానాలు చేస్తున్నారు. 1975 ఎమర్జెన్సీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నది. ఇషా గుప్తా, ఇలియానా హీరోయిన్లుగా నటిస్తున్నారు. 2010లో వచ్చిన వన్స్ అప్ ఆన్ ఏ టైమ్ ఇన్ ముంబై సినిమా తర్వాత అజయ్‌దేవ్‌గన్, ఇమ్రాన్హష్మీ, మిలన్లు మరో సారి సందడి చేయబోతున్నారు. నాలుగో సారి మాలీన్ మరియు అజయ్ కలిసి పనిచేయడం విశేషం. విద్యుత్ జాంవాల్, సంజయ్ మిశ్రా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు .