క‌మెడియ‌న్‌పై సీరియ‌స్ అయిన స్టార్ హీరో!

Mon,August 28, 2017 01:25 PM
Ajay Devgan and Baadshaho team upset with Kapil sharma

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అజ‌య్ దేవ్‌గ‌న్‌, అత‌ని బాద్‌షాహో మూవీ టీమ్ సీరియ‌స్ అయింది. కమెడియ‌న్ క‌పిల్‌శ‌ర్మ‌తో ఓ ప్రమోష‌న‌ల్ షో చేయాల్సి ఉన్నా.. దానిని ర‌ద్దు చేసుకొని అక్క‌డి నుంచి వెళ్లిపోయింది. ద క‌పిల్ శర్మ షో కోసం సెట్స్‌కు అజ‌య్‌తోపాటు బాద్‌షాహో టీమ్ ఇమ్రాన్ హ‌ష్మి, ఇలియానా, ఇషా గుప్తా వ‌చ్చారు. అయితే వాళ్లు క‌పిల్ కోసం చాలాసేపు వెయిట్ చేసినా.. అత‌ను రాక‌పోవ‌డంతో అక్క‌డి నుంచి సీరియ‌స్‌గా వెళ్లిపోయారు. శ‌నివారం ఉద‌యం ఈ ఘ‌ట‌న జ‌రిగింది. క‌పిల్ ఎందుకు రాలేద‌ని అడిగినా అత‌ని టీమ్ కూడా స‌రిగ్గా స్పందించ‌లేద‌ని స‌మాచారం. అత‌ని ఫోన్ కూడా స్విచాఫ్ చేసి ఉంది. అయినా క‌పిల్‌తో మాట్లాడ‌టానికి మూవీ టీమ్ అన్ని విధాలా ప్ర‌య‌త్నించినా.. ఫ‌లితం లేక‌పోయింది. ఈ మ‌ధ్యే భోజ్‌పురి న‌టుడు, బీజేపీ లీడ‌ర్ మ‌నోజ్ తివారీ కూడా ఇలాగే క‌పిల్‌శ‌ర్మ షో షూటింగ్ చేయ‌కుండానే మ‌ధ్య‌లోనే వెళ్లిపోయిన విష‌యం తెలిసిందే. ఇలా షూటింగ్స్ ర‌ద్దు చేసుకోవ‌డం క‌పిల్‌కు కొత్తేమీ కాదు. గ‌తంలో జ‌బ్ హ్యారీ మెట్ సెజ‌ల్ మూవీ ప్ర‌మోష‌న్‌ కోసం వ‌చ్చిన షారుక్‌, అనుష్క వెన‌క్కి వెళ్లిపోయారు. ఆ త‌ర్వాత ముబార‌క‌న్ టీమ్ కూడా ఓసారి షూటింగ్‌ను ర‌ద్దు చేసుకోవాల్సి వ‌చ్చింది. అయితే క‌పిల్‌పై దాడి జ‌ర‌గ‌డం వ‌ల్లే షూటింగ్‌ను ర‌ద్దు చేయాల్సి వ‌చ్చిందని ఆ త‌ర్వాత బాద్‌షాహో టీమ్‌కు క‌పిల్ టీమ్ స‌మాచారం ఇచ్చిన‌ట్లు తెలిసింది.

3874
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles