మ‌ల్టీ స్టార‌ర్ ప్రాజెక్ట్‌తో రానున్న ఆర్ఎక్స్ 100 ద‌ర్శ‌కుడు

Fri,November 16, 2018 01:40 PM
Ajay Bhupathi  Next To Be A Multi Starrer Film

ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా సైలెంట్‌గా వ‌చ్చి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చిత్రం ఆర్ ఎక్స్ 100. రామ్ గోపాల్ వ‌ర్మ ద‌గ్గ‌ర అసిస్టెంట్‌గా పనిచేసిన అజ‌య్ భూప‌తి ఆర్ ఎక్స్ 100 అనే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అయ్యాడు. మొద‌టి చిత్రంతోనే త‌న ప్ర‌తిభ‌ను చూపించి అంద‌ర‌కు అవాక్క‌య్యేలా చేశాడు. జూలై 12న విడుద‌లైన ఆర్ ఎక్స్ 100 చిత్రం తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకొని అంద‌రికి షాక్ ఇచ్చింది. ఈ సినిమాపై నితిన్, రామ్ చ‌ర‌ణ్ వంటి ప‌లువురు ప్ర‌ముఖులు ప్ర‌శంస‌లు కురిపించారు.

ఆర్ఎక్స్ 100 ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి త‌ర్వాతి చిత్రం ఏ ద‌ర్శ‌కుడితో ఉంటుందో అని సినీ అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, త్వ‌ర‌లో మ‌ల్టీ స్టార‌ర్ ప్రాజెక్ట్ మొద‌లు పెట్ట‌నున్నాడ‌ని ఫిలిం న‌గ‌ర్ జ‌నాలు ముచ్చ‌టించుకున్నారు. ఇటీవ‌లే ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించి స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి కాగా, రీసెంట్‌గా ఇద్ద‌రు హీరోల‌ని క‌లిసి క‌థ వివ‌రించాడ‌ట‌. దీనికి ఇంప్రెస్ అయిన ఇద్ద‌రు హీరోలు సినిమా చేసేందుకు స‌న్న‌ద్ధం అయ్యార‌ని టాక్. దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రానుంది. మరో వైపు నితిన్ తండ్రి సుధాక‌ర్ రెడ్డి.. అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. ఈ ప్రాజెక్ట్ నితిన్ హీరోగా రూపొంద‌నుందని టాక్ .

2109
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles