ఇండియ‌న్ 2 నుండి ఐశ్వ‌ర్య ఔట్..!

Fri,August 23, 2019 12:35 PM
Aishwarya Rajesh Walked Out From indian 2

క‌మ‌ల్ హాస‌న్, శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ఇండియ‌న్ 2. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ సినిమాలో క‌మ‌ల్ డ్యూయ‌ల్ రోల్ పోషించ‌నున్న‌ట్టు స‌మాచారం. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ప్రియా భ‌వాని శంక‌ర్, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, సిద్ధార్ద్ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. కౌస‌ల్య కృష్ణ‌మూర్తి చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించిన ఐశ్వ‌ర్య రాజేష్ కూడా చిత్రంలో కీల‌క పాత్ర చేయ‌నున్న‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ అమ్మ‌డు ఇండియ‌న్ 2 నుండి త‌ప్పుకున్న‌ట్టు తెలుస్తుంది. వేరే ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్న తాను ఇండియ‌న్ 2కి డేట్స్ అడ్జెస్ట్ చేయ‌లేక‌పోతుంద‌ట‌. ఈ క్ర‌మంలో ఐశ్వ‌ర్య ఇండియ‌న్2 చిత్రం నుండి త‌ప్పుకుంద‌ని స‌మాచారం. ఐశ్వ‌ర్య రాజేష్ తెలుగు డెబ్యూ చిత్రం కౌస‌ల్య కృష్ణ‌మూర్తి ఈ రోజే విడుద‌ల కాగా, ఈ చిత్రం మంచి టాక్‌తో దూసుకెళుతుంది. రైతుల సమస్యను, క్రికెటర్‌గా ఎదుగాలనుకొన్న యువతి కథను అద్భుతంగా మేళ‌విస్తూ చిత్రాన్ని రూపొందించార‌ని క్రిటిక్స్ చెబుతున్నారు.

2870
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles