రెజ్ల‌ర్ పాత్ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోయిన్

Sat,February 23, 2019 08:38 AM
Aishwarya Rajesh turns wrestler

క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ఐశ్వ‌ర్య రాజేష్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాదే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే ఐశ్వ‌ర్య ఈ చిత్రంతో పాటుగా మ‌రో ప‌ది సినిమాలు చేస్తుంది. ఇందులో భాగంగా ఓ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తుంది. ఆట‌గ‌దారా శివ ఫేం ఉద‌య్ శంక‌ర్ హీరోగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ఐశ్వ‌ర్య రెజ్ల‌ర్‌గా క‌నిపించ‌నుంద‌ట‌. ప్ర‌స్తుతం త‌న పాత్ర‌కి సంబంధించి పూర్తి శిక్ష‌ణ కూడా తీసుకుంద‌ట‌. నిర్మ‌ల్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. ఐశ్వ‌ర్య ఆ మ‌ధ్య శివ‌కార్తికేయ‌న్ స‌ర‌స‌న క‌నా అనే సినిమాలో న‌టించింది. ఇందులో క్రికెట‌ర్ పాత్ర‌లో న‌టించి మెప్పించింది. ఇప్పుడు రెజ్ల‌ర్‌గాను అభిమానుల మ‌న‌సులు దోచుకోవ‌డం ఖాయం అని మేక‌ర్స్ చెబుతున్నారు. ప్ర‌దీప్ రావ‌త్‌, సంజ‌య్ స్వ‌రూప్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లు పోషించ‌నున్నారు. ఇటీవ‌ల ఈ చిత్రానికి సంబంధించిన ఇంట‌ర్వెల్ బ్లాక్ అలంపూర్ జోగులాంబ టెంపుల్‌లో షూట్ చేశార‌ట‌. త్వ‌ర‌లోనే మ‌రో షెడ్యూల్‌ని మొద‌లు పెట్ట‌నున్నారు.

1380
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles