త‌న ప్రేమ‌, పెళ్ళిపై వ‌స్తున్న వార్త‌ల‌ని కొట్టిపారేసిన ఐశ్వ‌ర్య

Sat,May 11, 2019 10:43 AM
Aishwarya Rajesh Puts An End For Rumors

హీరోయిన్‌గానే కాకుండా న‌ట‌నకి ప్రాధాన్యం ఉన్న పాత్ర‌ల‌లో న‌టిస్తూ అశేష ఆద‌ర‌ణ పొందిన న‌టి ఐశ్వ‌ర్య రాజేష్‌. త‌మిళంలో ప‌దికి పైగా చిత్రాల‌లో న‌టించిన ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం ఓ నటుడితో రిలేషన్ షిప్‌లో ఉంద‌ని, త్వ‌ర‌లోనే ఆయ‌న‌తో పెళ్లి పీట‌లెక్క‌నుంద‌ని ప్ర‌చారం చేశారు. తన ప్రేమ‌, పెళ్లిపై వ‌స్తున్న వార్త‌ల‌పై ఐశ్వ‌ర్య త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించింది. నా ప్రేమాయణంపై ఎన్నో వార్త‌లు వింటున్నా. నేను ప్రేమించి పెళ్ళి చేసుకునే వ్య‌క్తి ఎవ‌రో నాకు చెప్పండి. అతని గురించి తెలుసుకోవాల‌ని చాలా ఆస‌క్తిగా ఉంది అంటూ సెటైర్ వేసింది ఐశ్వ‌ర్య‌. ఇక‌నైన త‌ప్పుడు వార్త‌ల‌ని ప్ర‌చారం చేయ‌కుండి. నిజంగా నేను పెళ్లి చేసుకునే స‌మ‌యం వ‌స్తే స్వ‌యంగా ప్ర‌క‌టిస్తాన‌ని ఐశ్వ‌ర్య తెలిపింది. ప్ర‌స్తుతం సింగిల్‌గా, సంతోషంగా ఉన్నానంటూ త‌న ట్వీట్‌లో పేర్కొంది. ఈ అమ్మ‌డు గ‌తంలో ఇంట‌ర్మీడియట్ లో ఉన్న‌ప్పుడు ప్రేమలోపడి మోసపోయానని ఓ ఇంట‌ర్యూలో తెలిపిన విష‌యం తెలిసిందే.



2441
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles