త‌ల్లికి స్వీటెస్ట్ విషెస్ చెప్పిన ఐష్‌

Thu,May 24, 2018 09:58 AM
Aishwarya Rai Sweetest wishes to her mother

మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వ‌ర్య‌రాయ్ ఇటు ప‌ర్స‌న‌ల్ లైఫ్ తో పాటు ప్రొఫెష‌న‌ల్ లైఫ్ ని చాలా బాగా మెయింటైన్ చేస్తుందనే విష‌యం అంద‌రికి తెలిసిందే. సినిమాల‌తో ఎంతో బిజీగా ఉండే ఐష్ త‌న తల్లి వింద్రా బ‌ర్త్‌డేని ప్ర‌తి ఏడాది గ్రాండ్‌గా జ‌రుపుతుంది. గ‌త ఏడాది కుటుంబ స‌భ్యులు, సన్నిహితుల స‌మ‌క్షంలో బ‌ర్త్‌డే సెలబ్రేట్ చేసిన ఐష్ ఈ ఏడాది కూడా అంతే గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసింది. త‌ల్లి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఐష్ త‌న త‌ల్లితో పాటు కూతురిని తీసుకొని డిన్న‌ర్‌కి వెళ్ళింది. వాటికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇక ఇటీవ‌ల ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఐష్ 2003లో జ‌రిగిన కేన్స్ చ‌ల‌న చిత్రోత్స‌వంలో దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. ‘ఐలవ్యూ. నువ్వున్నావ్ కాబట్టే నేనున్నా. హ్యాపీ హ్యాపీ బర్త్‌డే మమ్మీ డార్లింగ్’ అని కామెంట్ పెట్టింది. ఐష్ షేర్ చేసిన ఫోటో అభిమానుల‌కి తెగ న‌చ్చేసింది. ఇక ఐష్ తండ్రి, వ్రిందా భ‌ర్త కృష్ణరాజ్ రాయ్ గ‌త ఏడాది అనారోగ్యంతో క‌న్ను మూసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఐశ్వ‌ర్య‌రాయ్ ఫ్యానే ఖాన్ అనే సినిమా చేస్తుంది. రాకేశ్ ఓం ప్ర‌కాశ్ మెహ్రా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో అనీల్ క‌పూర్‌, రాజ్ కుమార్ రావులు కూడా న‌టిస్తున్నారు.
2551
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS