ఆరాధ్య తీసిన అంద‌మైన పిక్

Sun,April 21, 2019 07:48 AM
Aishwarya Rai is the honey in this honeymoon pic

బాలీవుడ్ ఫిలిం ఇండ‌స్ట్రీలోని మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్స్‌లో అభిషేక్ బ‌చ్చ‌న్‌, ఐశ్వ‌ర్య‌రాయ్ ఒక‌రు. 2007 ఏప్రిల్ 20న పెళ్ళి పీట‌లు ఎక్కిన ఈ జంట త‌మ దాంప‌త్య జీవితంలో 12 ఏళ్ళు ప్ర‌యాణించింది. వీరికి ఆరాధ్య అనే కూతురు కూడా ఉన్న సంగ‌తి తెలిసిందే. న్యూయార్క్‌లో జ‌రిగిన గురు ప్రీమియ‌ర్ షోలో అభిషేక్ .. ఐష్‌కి ప్ర‌పోజ్ చేయ‌డం, ఆమె ఓకే అన‌డం, ఆ త‌ర్వాత వివాహం కావ‌డం జ‌రిగిపోయాయి. గురు చిత్రంలో క‌లిసి న‌టించిన వీరిరివురు అంత‌క ముందు ‘టాయి అక్షర్‌ ప్రేమ్‌ కే’ (2000), ‘కుచ్‌ నా కహో’ (2003) చిత్రాల్లో కలిసి నటించారు. ఇప్పుడు గులాబ్ జామ్ అనే చిత్రంలో క‌లిసి నటించేందుకు సిద్ద‌మ‌య్యారు . అయితే ప్ర‌స్తుతం త‌మ వెడ్డింగ్ యానివ‌ర్సరీని మాల్దీవుల‌లో జ‌రుపుకుంటున్న అభిషేక్, ఐశ్వ‌ర్య‌ర్యాయ్‌లు అక్క‌డి అందమైన పిక్‌ల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అలానే త‌మ జీవితంలో వెలుగు దివ్వె అయిన ఆరాధ్య తీసిన ఓ ఫోటోని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసిన ఐష్ చాలా హ్యాపీగా ఫీలైంది.

2017
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles