లైవ్ షోలో స్టేజ్ పై ఆడిపాడిన ఐష్.. దద్దరిల్లిన ఆడిటోరియం

Wed,July 11, 2018 03:52 PM
Aishwarya Rai follows footsteps for Fanney Khan

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ స్టేజ్ పై ఆడిపాడింది. దీంతో అభిమానులు కేకలు, ఈలలు వేస్తూ ఆడిటోరియం దద్దరిల్లేలా చేశారు. అయితే ఇది రియల్ లైఫ్ లో కాదులేండి. రీల్ లైఫ్ లో. అతుల్ మంజ్రేకర్ తెరకెక్కిస్తున్న ఫన్నేఖాన్ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఐష్ ఇందులో పాప్ సింగర్ గా కనిపిస్తోంది. లైవ్ షో ఈవెంట్ లో భాగంగా ఆడియన్స్ ముందు స్టేజ్ పై ఆడి పాడిన ఐష్ ని చూసి అభిమానులు గంతులు వేశారు. మోహబ్బత్ అనే ఈ పాటకి ఐష్ స్టెప్స్ వేయగా, ఈ పాటకి ఫ్రాంక్ గాట్సన్ కొరియోగ్రఫీ అందించారు. చిత్రంలో ఐష్ పాత్రని బట్టే ఈ సాంగ్ డిజైన్ చేసామని దర్శకుడు తెలిపారు.

ఫన్నే ఖాన్ చిత్రంలో అనీల్ కపూర్ , రాజ్ కుమార్ రావు కూడా ప్రధాన పాత్రలు పోషించారు. మంచి గాయకుడు కావాలనే కోరిక తీర్చుకోలేని తండ్రి పాత్రలో అనీల్ కపూర్ నటించారు. అనిల్ కపూర్ గాయకుడు అవ్వాలన్న చిరకాల కోరికను తన కూతురు ద్వారా తీర్చుకోవాలనుకుంటాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా గాయకుడు కాలేని అనిల్ కపూర్ తన స్నేహితుడు ( రాజ్ కుమార్ రావు ) సాయంతో పాప్ స్టార్ ఐశ్వర్యారాయ్ ని కిడ్నాప్ చేస్తాడు. అనిల్ కపూర్ తన కలను ఎలా నెరవేర్చుకున్నాడన్నది సినిమా చూస్తే తెలుస్తుంది. ఆగస్ట్ 3న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి విడుదలైన సాంగ్ పై మీరు ఓ లుక్కేయండి.

2420
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS