8 ఏళ్ల త‌ర్వాత వెండితెర‌పై జంట‌గా ..

Tue,July 31, 2018 12:10 PM
Aishwarya Rai confirms Gulab Jamun with Abhishek Bachchan,

సినిమా సెలబ్రిటీస్ లో ప్రేమాయణాలు కామన్ . హీరో హీరోయిన్స్ ప్రేమించి పెళ్ళి చేసుకోవడం లేదంటే దర్శకుడు, కథానాయికని వివాహమాడడం మనం చాలానే చూశాం. అయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలపై బాగా ఆసక్తి కనబరిచే అభిమానులు పెళ్ళి తర్వాత త‌మ అభిమాన న‌టులు కలిసి వెండితెరపై కనిపించి సందడి చేయాలని కోరుకుంటారు. ఒకప్పుడు అమలని వివాహమాడిన నాగ్ పెళ్ళికి ముందు పలు సినిమాలలో కలిసి నటించాడు. కాని పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసి ఒక్క సినిమా చేయలేదు. ఇక సూర్య, జ్యోతికలు కూడా వారి పెళ్లికి ముందు చాలా చిత్రాలే చేశారు. త్వరలో వీరిద్దరు కలిసి వెండితెరపై సందడి చేయనున్నట్టు కొన్ని వార్తలు వచ్చాయి.ఇప్పుడు నాగ చైత‌న్య‌, స‌మంత కూడా పెళ్లి త‌ర్వాత ఓ మూవీ చేస్తున్నారు.

బాలీవుడ్ విషయానికి వస్తే ఇక్కడ ప్రేమ పెళ్లిళ్ల వ్యవహారం చాలానే ఉంది. ముఖ్యంగా 2007లో పెళ్ళి చేసుకున్న ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ ల జంట ఎనిమిదేళ్ళ‌ కిత్రం మణిరత్నం దర్శకత్వం వహించిన ‘రావణ్‌’ చిత్రంలో కలిసి నటించారు. అంత‌క ముందు ‘ఉమ్రావ్‌ జాన్’, ‘కుచ్‌ నా కహో’, ‘ధూమ్‌ 2’, ‘గురు’ తదితర చిత్రాల్లో ఐష్‌, అభి జంటగా నటించారు. మళ్లీ ఇప్పటివరకు వీరిద్దరు కాంబినేషన్ లో ఎలాంటి చిత్రం రాలేదు. ఇప్పుడు ఆ జంట మరోసారి వెండితెరపై సందడి చేసే సమయం ఆసన్నమైంది. గులాబ్ జామున్ అనే టైటిల్ తో రూపొంద‌నున్న చిత్రంలో ఐష్, అభిషేక్ ప్రధాన పాత్రలు పోషించ‌నున్నార‌ని, ఈ మూవీని రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా అనురాగ్ కశ్యప్ తెరకెక్కించనున్నార‌ని అప్ప‌ట్లో చాలా వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై తాజాగా క్లారిటీ వ‌చ్చింది.

అందాల తార ఐశ్వ‌ర్య‌రాయ్ త్వ‌ర‌లో గులాబ్ జామున్ పేరుతో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో సినిమా చేయ‌నున్న‌ట్టు ఓ బాలీవుడ్ పత్రిక‌కి తెలియ‌జేసింది. ఇందులో హీరోగా అభిషేక్ బ‌చ్చ‌న్ న‌టిస్తార‌ని చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం అభి మ‌న్మ‌ర్జియా చిత్రంతో బిజీగా ఉండ‌గా, ఐష్ ఫ‌న్నేఖాన్ చిత్రం చేస్తుంది. ఈ రెండు సినిమాలు పూర్తైన త‌ర్వాత మూవీ మొద‌లవుతుంద‌ని ఐష్ తెలిపింది. గ‌త ఏడాదే ద‌ర్శ‌కుడు త‌మ‌ని సంప్ర‌దించిన‌,వేరే ప్రాజెక్టుల‌తో బిజీగా ఉండ‌డం వ‌ల‌న కొద్దిగా లేట్ అయింద‌ని ఐష్ స్ప‌ష్టం చేసింది. క‌థ మాకు బాగా న‌చ్చింది. అభిషేక్ పాత్ర చాలా బాగుంటుంద‌ని ఐష్ వెల్ల‌డించింది. మ‌రి ఎనిమిదేళ్ల త‌ర్వాత వెండితెర‌పై జంట‌గా క‌నిపించ‌నున్నవీరిద్ద‌రిని చూసిన‌ అభిమానుల ఆనందానికి హ‌ద్దులు ఉండ‌వ‌నే చెప్పొచ్చు.

3549
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles