ప్ర‌తినాయ‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్న ఐశ్వ‌ర్య‌రాయ్

Sat,April 6, 2019 10:46 AM
Aishwarya Rai Bachchan to play a grey character

మాజీ మిస్ వ‌ర‌ల్డ్ ఐశ్వ‌ర్య‌రాయ్ చివ‌రిగా ఫన్నేఖాన్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించింది. ఆచితూచి క‌థ‌ల‌ని ఎంపిక చేసుకుంటున్న ఐశ్వ‌ర్య‌రాయ్ కల్కి రచించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ పుస్తకం ఆధారంగా తెరకెక్క‌నున్న చిత్రంలో న‌టించ‌నున్న‌ట్టు ఆ మ‌ధ్య వార్త‌లు వ‌చ్చాయి. నందిని అనే పాత్ర కోసం ఐష్‌ని మ‌ణిర‌త్నం సంప్ర‌దించాడని, అందుకు ఆమె గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని టాక్. తాజా స‌మాచారం ప్ర‌కారం ఐష్ ఈ చిత్రంలో ప్ర‌తినాయ‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ట‌. దీనిపై త్వర‌లోనే క్లారిటీ రానుంది. ఐష్ గ‌తంలో మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ‘ఇరువర్‌’, ‘గురు’, ‘రావణ్‌’ చిత్రాల‌లో న‌టించిన సంగతి తెలిసిందే. మ‌ణిర‌త్నం తెర‌కెక్కించ‌నున్న తాజా ప్రాజెక్ట్‌లో బిగ్ బీ కూడా కీల‌క పాత్ర పోషించ‌నున్నాడ‌ని అంటున్నారు. జ‌యం ర‌వి, విక్రమ్, శింబు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్క‌నున్న ఈ ప్రాజెక్ట్ చారిత్రాత్మ‌క నేప‌థ్యంలో ఉంటుంద‌ని చెబుతున్నారు.

1354
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles