జాతీయ గీతం వింటూ ఎమోష‌న‌ల్ అయిన ఐష్‌

Fri,September 7, 2018 01:19 PM
Aishwarya Rai Bachchan tears up during national anthem

మాజీ ప్ర‌పంచ సుందరి ఐశ్వ‌ర్య‌రాయ్ ఎంత పెద్ద సినిమా స్టార్ అయిన‌ప్ప‌టికి ఆమెకి కుటుంబ స‌భ్యులు, దేశం మీద ప్రేమ‌, గౌరవం ఎంత ఉంద‌నేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప‌లు సంద‌ర్భాల‌లో ఐష్ త‌న దేశ‌భ‌క్తిని ప‌లు ర‌కాలుగా ప్రూవ్ చేసుకుంది. తాజాగా ఓ ఫంక్ష‌న్‌కి హాజ‌రైన ఐశ్వ‌ర్య‌రాయ్ జాతీయ గీతం పూర్తైన త‌ర్వాత క‌న్నీళ్ళు పెట్టుకుంది. అభిమానుల‌తో ప‌లు సైగ‌లు చేసిన త‌ర్వాత క‌న్నీరు తుడ్చుకోవ‌డం వీడియోలో రికార్డు కావ‌డంతో అభిమానులు ఆమెని చూసి షాక్ అయ్యారు. జాతీయ గీతం విని తాను ఎంత‌గా పుల‌క‌రించిపోయిందో అంటూ చర్చించుకోవ‌డం మొద‌లు పెట్టారు. ఐష్ తో పాటు బాలీవుడ్ సెల‌బ్రిటీస్ ష‌బానా అజ్మీ,సోనూ నిగ‌మ్ కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ఇండియ‌న్ ఫిలింఫెస్టివ‌ల్ ఆఫ్ మెల్ బోర్న్‌లో జాతీయ జెండాని హోస్ట్ చేసిన తొలి మ‌హిళా న‌టి ఐశ్వ‌ర్య‌ర్యాయ్ అన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవలే ఫన్నే ఖాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఐష్ ఈ సినిమాతో బాక్సాఫీస్‌ని షేక్ చేసింది . త్వరలో తాను డైరెక్షన్ వైపు టర్న్ అవుతానని ఐష్ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో వెల్లడించారు. ఇక త‌న భ‌ర్త అభిషేక్ బ‌చ్చ‌న్ తో క‌లిసి ఓ సినిమా చేసేందుకు కూడా ఐష్ సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది.

3398
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS