రోబో2 చిత్రంలో అందాల సుంద‌రి ఐష్‌..!

Thu,April 5, 2018 01:14 PM
Aishwarya Rai Bachchan plays a role in 2.0

2010లో విడుద‌లైన రోబో చిత్రానికి సీక్వెల్ గా తెర‌కెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ 2.0. ర‌జ‌నీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్స‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న ఈ సినిమా ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకోగా, ప్ర‌స్తుతం సీజీ వ‌ర్క్స్ జ‌రుపుకుంటుంది. భారీ గ్రాఫిక్స్ తో రూపొందుతున్న ఈ సినిమాలో దాదాపు 11000 విజువల్‌ ఎఫెక్ట్స్‌ షాట్స్ ఉండ‌గా, వీటికి సంబంధించిన ప‌ని ప‌లు దేశాల్లో జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తుంది. దీంతో సినిమా రిలీజ్‌కి మ‌రింత టైం ప‌డుతుంది. క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని భావిస్తున్న శంక‌ర్‌ సినిమాను వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నాడు. 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 3డీ ఫార్మాట్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే చిత్రానికి సంబంధించిన ఓ వార్త అభిమానులకి షాకింగ్‌గా ఉంది. మాజీ ప్ర‌పంచ సుంద‌రి, గ్లామ‌ర‌స్ బ్యూటీ ఐశ్వ‌ర్య‌రాయ్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం అయింద‌నే వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఐష్ పాత్ర‌కి డ‌బ్బింగ్ చెప్పిన డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ స‌బిత ఈ విష‌యాన్ని మీడియాతో చెప్ప‌డంతో ఈ వార్త వైర‌ల్‌గా మారింది. మ‌రి దీనికి సంబంధించిన క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి. లాస్ ఏంజిల్స్ లోని ప్రముఖ మాబ్ సీన్ సంస్థలో టీజర్ కి సంబంధించిన పనులు వేగంగా జరుగుతుండ‌గా, ఆన్‌లైన్‌ దొంగలు కొంద‌రు టీజర్‌ను సోషల్ మీడియాలో లీక్ చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రి కొద్ది రోజుల‌లో హైదరాబాద్ లోనే పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో టీజ‌ర్‌ని అఫీషియ‌ల్‌గా విడుదల చేయనున్నార‌ని టాక్.

2863
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles