జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌పై తాజా అప్‌డేట్‌ ..!

Wed,August 22, 2018 01:24 PM
Aishwarya Rai Bachchan and Anushka Shetty   biopic on Jayalalithaa

త‌మిళ‌నాడు ఐర‌న్ లేడీగా, అమ్మ‌గా, పురుచ్చతలైవీగా త‌మిళ తంబీల‌తో పిలిపించుకున్న జ‌య‌ల‌లిత గ‌త ఏడాది అనారోగ్యం కార‌ణంగా మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. జ‌య‌ల‌లిత జీవితం ఎంద‌రికో ఆద‌ర్శం అని ఆమెపై సినిమా తీయాల‌ని ప‌లువురు ద‌ర్శక నిర్మాత‌లు భావించారు. ఏ.ఎల్‌. విజ‌య్‌, ప్రియ‌ద‌ర్శ‌న్‌, భార‌తీ రాజా, వైబ్రీ మీడియా,ఆదిత్య భ‌ర‌ద్వాజ్ త‌దిత‌రులు బ‌యోపిక్ స్క్రిప్ట్‌ని రూపొందించే ప‌నిలో ఉన్నారు. వీరిలో ఎవ‌రు ముందుగా ఈ సినిమాని తెర‌కెక్కిస్తారో తెలియ‌దు కాని జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌కి సంబంధించి అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి. త‌మిళ ద‌ర్శ‌కుడు భార‌తీరాజా.. జయలలిత పాత్రలో ఐశ్వర్యారాయ్‌ని కానీ... అనుష్కను నటింపజేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు భారతీ రాజా ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌కి దేశవ్యాప్తంగా బ‌జ్ క్రియేట్ అయ్యేందుకు జ‌య‌ల‌లిత పాత్ర‌లో ఐశ్వ‌ర్య‌రాయ్ లేదంటే అనుష్క‌ని తీసుకోవాల‌ని భావిస్తున్నాడ‌ట‌. బాహుబ‌లి సినిమాతో అనుష్కకి నేష‌న‌ల్ వైడ్ గా ప్రాముఖ్య‌త ల‌భించిన సంగ‌తి తెలిసిందే.

3779
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles