మ‌రోసారి త‌ల్లి ప్ర‌మోష‌న్ అందుకోనున్న ఐష్‌..!

Sun,March 24, 2019 10:15 AM

మాజీ మిస్ వ‌ర‌ల్డ్ ఐశ్వ‌ర్య‌రాయ్, బాలీవుడ్ హీరో అభిషేక్ బ‌చ్చ‌న్ ఎంత లో-ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పార్టీస్‌లో, ఇత‌ర‌త్రా కార్య‌క్ర‌మాల‌లో పెద్ద‌గా పాల్గొన‌ని వారు ప‌ర్స‌న‌ల్‌ విష‌యాల‌ని చాలా సీక్రెట్‌గా ఉంచుతారు. అయితే ఇటీవ‌ల ముంబైలో జ‌రిగిన హోలీ వేడుక‌లలో బాలీవుడ్ తారాగ‌ణం అంతా పాల్గొని సంద‌డి చేశారు. కాని ఐష్ ఆమె భ‌ర్త అభిషేక్ బ‌చ్చ‌న్ హాలిడేస్‌ని ఎంజాయ్ చేయ‌డానికి గోవా వెళ్ళారు. అక్క‌డ బీచ్ ప‌రిస‌ర ప్రాంతాల‌లో ఎంజాయ్ చేసిన‌ వారు న‌డుచుకుంటూ వ‌స్తుండ‌గా, గోవాకి చెందిన‌ ఫోటోగ్రాఫ‌ర్ ఈ జంట‌ని త‌మ కెమెరాలో బంధించారు. వెంట‌నే ఆ ఫోటోతో గోవా లోక‌ల్ న్యూస్ పేప‌ర్ క‌థ‌నం ప్ర‌చురించింది. అయితే ఆ ఫోటోలో ఐష్ బేబి బంప్‌తో క‌నిపిస్తుంద‌ని, త్వ‌ర‌లోనే పండంటి బిడ్డ‌కి జ‌న్మ‌నివ్వ‌నుందంటూ ప్ర‌చారాలు మొద‌లు పెట్టారు. మ‌రి దీనిపై ఐష్ కాని, అభిషేక్ కాని స్పందిస్తారేమో చూడాలి.



3973
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles