అప్పుడు న‌య‌న‌తార‌, అనుష్క‌, శృతి.. ఇప్పుడు ఐష్‌

Fri,July 12, 2019 09:03 AM
Aishwarya Rai Bachchan acts in chiru movie

గాసిప్ రాయుళ్ళు పుట్టించే వార్త‌ల‌లో ఎంత నిజం ఉంటుంద‌ని చెప్ప‌డం మాత్రం చాలా క‌ష్టం. కొద్ది రోజులుగా చిరు 152వ చిత్రంలో న‌టించే క‌థానాయిక‌కి సంబంధించి ప‌లు రూమ‌ర్స్ పుట్టిస్తున్నారు. ముందుగా న‌య‌న‌తార ఆ త‌ర్వాత అనుష్క , కొన్నాళ్ళ త‌ర్వాత శృతి హాసన్ అని అన్నారు. తాజాగా చిరుకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఐశ్వ‌ర్యరాయ్ న‌టిస్తుంద‌ని ప్ర‌చారం చేస్తున్నారు. ఇప్ప‌టికే త‌న 151వ చిత్రంగా రూపొందిన సైరా చిత్ర షూటింగ్ పూర్తి చేసిన చిరు ఉగాది నుండి కొర‌టాల శివ ప్రాజెక్ట్ మొద‌లు పెట్ట‌నున్నాడు. ఇందులో ఆయ‌న డ్యూయ‌ల్ రోల్ పోషించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఓ పాత్ర‌కి జోడీగా ఐశ్వ‌ర్య‌రాయ్ న‌టిస్తుంద‌ని చెప్పుకొస్తున్నారు. మ‌రి ఇందులో ఎంత నిజ‌ముంద‌నేది తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

3050
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles