న‌య‌న‌తార 'ఐరా' అఫీషియ‌ల్ టీజ‌ర్ విడుదల‌

Sun,January 6, 2019 07:51 AM
airaa official teaser released

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార వ‌రుస సినిమాల‌తో జెట్‌లా దూసుకెళుతుంది. రీసెంట్‌గా కొల‌మావు కోకిల అనే చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన న‌య‌న‌తార ప్ర‌స్తుతం చిరంజీవి స‌ర‌స‌న సైరా చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. అజిత్ విశ్వాసం, శివ‌కార్తికేయ‌న్ చిత్రం, నివీన్ పాలి ల‌వ్ యాక్ష‌న్ డ్రామాల‌లోను న‌య‌న‌తార న‌టిస్తుంది. అయితే ఆమె మ‌రో చిత్రం కోటపాటి రాజేష్ నిర్మాతగా సర్జన్ కె.ఎమ్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. న‌య‌న 63వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి ‘ఐరా’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో నయనతార డబుల్ రోల్‌లో నటిస్తుంది. చాలా తక్కువ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. 'గ్రహణం' ఫేమ్‌ సుందరమూర్తి సంగీతం సమకూర్చుతున్నారు. తాజాగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇది సినీ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది. మీరు ఈ టీజ‌ర్‌పై ఓ లుక్కేయండి.

1714
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles