న‌య‌న‌తార 'ఐరా' ట్రైల‌ర్ విడుద‌ల‌

Thu,March 21, 2019 08:27 AM
airaa movie trailer released

సౌత్‌లో ఫుల్‌ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న న‌య‌న‌తార ప్ర‌స్తుతం నాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాల‌నే చేస్తుంది. మ‌ళ్ళీ ఆమె న‌టించిన త‌మిళ చిత్రాల‌న్నింటిని తెలుగులో అనువాదం చేసి విడుద‌ల చేస్తుంది. రీసెంట్‌గా ఆమె న‌టించిన‌ త‌మిళ చిత్రం ‘ఇమైక్క నోడిగల్’ తెలుగులో ‘అంజలి సీబీఐ ఆఫీసర్’ పేరుతో విడుద‌లైంది. ఈ చిత్రానికి మంచి ఆద‌ర‌ణ ల‌బించింది. ప్ర‌స్తుతం సైరా చిత్రంతో పాటు పలు త‌మిళ సినిమాల‌తో బిజీగా ఉన్న న‌య‌న‌తార కొన్నాళ్ళ నుండి ఐరా అనే చిత్రం చేస్తుంది. కోటపాటి రాజేష్ నిర్మాతగా సర్జన్ కె.ఎమ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. న‌య‌న 63వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతార డబుల్ రోల్‌లో నటిస్తుంది. చాలా తక్కువ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. 'గ్రహణం' ఫేమ్‌ సుందరమూర్తి సంగీతం సమకూర్చుతున్నారు. ఈ చిత్ర టీజ‌ర్ ఇప్ప‌టికే విడుద‌ల కాగా, దానికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులోని సన్నివేశాలు ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. తెలుగు, త‌మిళంలో ఈ చిత్రాన్ని మార్చి 28న విడుద‌ల చేయ‌నున్నారు. తాజాగా విడుద‌లైన చిత్ర ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

939
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles