రజనీ సూపర్‌స్టార్ అవుతారని కలలు కనలేదు..

Tue,November 19, 2019 04:08 PM


చెన్నై: రాజకీయాల్లో అద్భుతాలు, విచిత్రాలు జరుగుతుంటాయని తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రభుత్వాన్ని ఉద్దేశించి సూపర్‌స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అన్నాడీఎంకే కౌంటర్ అటాక్ చేసింది. మీరు (రజనీకాంత్) సూపర్‌స్టార్ అవ్వాలని కలలు కనేవారు కాదని, బస్ కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించిన తర్వాత స్టార్ అయ్యారని పార్టీ పేర్కొంది. ఎడప్పడి పళనిస్వామి తెరపై వ్యక్తి కాదని, ఎన్నికల్లో ప్రజల మద్దతును గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన వ్యక్తి అని రజనీకాంత్ వ్యాఖ్యలకు చురకలంటించింది.


కమల్‌హాసన్ 60 ఏళ్ల సినీ ప్రస్థానం సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రజనీ మాట్లాడుతూ..రాజకీయాల్లో అద్భుతాలు, విచిత్రాలు జరుగుతాయి. పళనిస్వామి సీఎం అవుతారని ఎవరనుకున్నారు. పళనిస్వామి సీఎం అయిన తర్వాత కూడా 20 రోజుల్లో ఆయన ప్రభుత్వం కూలిపోతుందనుకున్నారు. ఐదారు నెలల కన్నా ఎక్కువ రోజులు ప్రభుత్వం నడవదనుకున్నారు. కానీ కొన్ని అద్భుతాల వల్ల పళనిస్వామి సీఎంగా రెండేళ్లు పూర్తి చేసుకున్నారని వ్యాఖ్యానించారు.

994
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles