స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా అన్నాడీఎంకే ఆందోళ‌న‌

Thu,November 8, 2018 02:56 PM
AIADMK demands to remove controversial scenes from Sarkar film

చెన్నై: హీరో విజ‌య్ న‌టించిన త‌మిళ ఫిల్మ్‌ స‌ర్కార్ పై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. అన్నాడీఎంకే కార్య‌క‌ర్తలు మ‌ధురైలోని ప్రియా కాంప్లెక్స్ ముందు ధ‌ర్నా చేశారు. స‌ర్కార్ సినిమాలో వివాదాస్ప‌ద సీన్లు, డైలాగ్‌లు ఉన్నాయ‌ని, వాటిని తొల‌గించే వ‌ర‌కు తాము ఆందోళ‌న చేస్తామ‌ని అన్నాడీఎంకే ఎమ్మెల్యే వీవీ రాజ‌న్ చెల్ల‌ప్పా తెలిపారు. ఎగ్జిబిట‌ర్లు ఈ సినిమాను ప్ర‌ద‌ర్శించ రాదు అని కోరుతున్న‌ట్లు వాళ్లు తెలిపారు.

స‌ర్కార్ సినిమాలో మాజీ సీఎం జ‌య‌ల‌లిత‌కు వ్య‌తిరేకంగా కొన్ని డైలాగ్‌లు ఉన్న‌ట్లు అన్నాడీఎంకే కార్య‌క‌ర్త‌లు గుర్తించారు. వాటి ప‌ట్ల ఆ పార్టీ అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్న‌ది. కొన్ని ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను కూడా సినిమాలో త‌క్కువ చేసి చూపించార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌భుత్వ సంక్షేమ డ‌బ్బును త‌గ‌ల‌బెట్టే సీన్ ఒక‌టి ఉంది, ఆ సీన్‌ను అన్నాడీఎంకే వ్య‌తిరేకిస్తున్న‌ది. ఇదొక‌ర‌కంగా ఉగ్ర‌వాదులు హింస‌ను ప్రేరేపించిన‌ట్లు ఉన్న‌ద‌ని ఆరోపిస్తున్నారు. మాజీ సీఎంపై మ‌చ్చ తెచ్చేందుకు ఎందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అన్నాడీఎంకే నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

1039
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS