బుల్లితెర‌పై కూడా నిరాశ‌ప‌ర‌చిన అజ్ఞాతవాసి

Fri,November 16, 2018 12:42 PM
Agnyaathavasi Turned Out To Be Disaster On Small Screen

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం అజ్ఞాతవాసి. పవన్ 25వ చిత్రంగా రూపొందిన ఈ మూవీ భారీ సంఖ్య‌లో విడుద‌లైంది. సంక్రాంతి కానుక‌గా త‌న చిత్రాన్ని తొలిసారి విడుద‌ల చేసిన ప‌వ‌న్‌ ఈ చిత్రంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘోర ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకున్నాడు. ప‌వ‌న్- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన జ‌ల్సా- అత్తారింటికి దారేది చిత్రాలు భారీ విజ‌యం సాధించ‌డంతో అజ్ఞాత‌వాసి కూడా మంచి విజ‌యాన్ని సాధిస్తుంద‌ని అంద‌రు అనుకున్నారు. కాని స్టోరీ తేడా కొట్ట‌డంతో ఫ్లాప్ లిస్ట్‌లో చేరింది. అయితే ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ ఛానెల్ 19.5 కోట్ల‌కి శాటిలైట్ రైట్స్ ద‌క్కించుకుంది. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమాని ప్ర‌సారం చేయ‌గా 5.3 టీఆర్పీ ద‌క్కించుకుంది. ఓ స్టార్ హీరో సినిమాకి ఇంత త‌క్కువ టీఆర్పీ రేటింగ్ రావ‌డంతో ఛానెల్ నిర్వాహకులు కూడా షాక్‌లో ఉన్నారు. అజ్ఞాత‌వాసి చిత్రం రిలీజైన ప‌ది నెల‌ల త‌ర్వాత బుల్లితెర‌పై ఈ చిత్రం ప్ర‌సారం అయిన‌ప్ప‌టికి, అతి త‌క్కువ టీఆర్పీ రేటింగ్ ఈ మూవీకి ద‌క్క‌డంతో అభిమానులు కూడా నిరాశ‌లో ఉన్నారు. ప‌వ‌న్ ప్ర‌స్తుతం సినిమాల‌కి దూరంగా ఉంటూ, రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే

2806
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles