నిన్న తైమూర్.. నేడు ప్రియాంక క‌పుల్‌

Wed,December 5, 2018 01:42 PM
After Taimur, Its Priyanka And Nicks Doll Trending

ఈ మ‌ధ్య కాలంలో పాపులర్ సెల‌బ్రిటీస్ బొమ్మ‌లు మార్కెట్‌లో అమ్మ‌కానికి పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్‌ల ముద్దుల తనయుడు తైమూర్ అలీ ఖాన్ బొమ్మ‌లు కేరళలోని ఓ బొమ్మల దుకాణంలో దర్శనిమవ్వ‌డం అంద‌రికి షాకింగ్‌గా మారింది. ఓ నెటిజ‌న్ షాపులోని తైమూర్ బొమ్మ‌ను ఫోటో తీసి ఇంట‌ర్నెట్‌లో షేర్ చేయ‌డంతో ఇది వైర‌ల్‌గా మారింది. ఇంత చిన్న వ‌య‌స్సులో అంత ఫాలోయింగ్ తైమూర్‌కి రావ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు ఖంగు తిన్నారు. తాజాగా ప్రియాంక, నిక్‌ జొనాస్‌ల బొమ్మలు దర్శనమిస్తున్నాయి. జోధ్‌పూర్‌కు చెందిన మనోజ్‌ చౌహాన్‌ అనే కళాకారుడు ప్రియాంక, నిక్‌ కలిసున్న మట్టి బొమ్మలను రూపొందించారు. కొన్ని నెలల క్రితం రిలయన్స్‌ సంస్థల అధినేత ముఖేశ్‌ అంబానీ నివాసంలో జరిగిన ఆకాశ్‌-శ్లోకా మెహతా నిశ్చితార్థపు పార్టీకి నిక్‌తో కలిసి ప్రియాంక హాజరయ్యారు. ఆ సమయంలో వారిద్దరూ దిగిన ఫొటో ఆధారంగా మనోజ్‌ ఈ బొమ్మలను రూపొందించారట. ప్రియాంక‌- నిక్‌ల వివాహం డిసెంబ‌ర్ 2న క్రైస్త‌వ సంప్ర‌దాయంలో జ‌ర‌గగా, డిసెంబ‌ర్ 3న హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం జ‌రిగింది. నిన్న సాయంత్రం ఢిల్లీలో జ‌రిగిన రిసెప్ష‌న్‌కి మోదీ కూడా హాజ‌రయ్యారు.

1999
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles