మ‌రో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ని సెట్ చేసిన సంజ‌య్ లీలా

Wed,October 31, 2018 09:40 AM
After Padmaavat, Sanjay Leela Bhansalis Next Is Hira Mandi

అనేక చారిత్రాత్మక చిత్రాల‌ని అత్య‌ద్భుతంగా తెర‌కెక్కించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందుతున్న ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలి. రీసెంట్‌గా ప‌ద్మావ‌త్ అనే చిత్రాన్ని తెర‌కెక్కించి ప్రేక్ష‌కుల‌ని ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేశాడు. ఈ చిత్రం ఎన్నో వివాదాల మ‌ధ్య తెరకెక్కిన‌, చివ‌రికి మంచి విజ‌యం సాధించింది. ఎన్నో రికార్డుల‌ని బ్రేక్ చేస్తూ ఈ ఏడాది విడుద‌లైన ఉత్త‌మ చిత్ర‌ల‌లో ఒక‌టిగా నిలిచింది. అయితే ప‌ద్మావ‌త్ త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సంజ‌య్ లీలా భ‌న్సాలీ మరో క్రేజీ ప్రాజెక్ట్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. హీరో మండి అనే టైటిల్‌తో సంజ‌య్ నెక్స్ ప్రాజెక్ట్ ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా, ఇది అనేక మంది వేశ్యలతో బిజినెస్ చేసిన‌ సంచలనాత్మక గ్యాంగ్ స్ట‌ర్‌ గంగూబాయి కోటియులి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కుతుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంద‌ట‌. ఎప్పుడో ఈ ప్రాజెక్ట్ చేయాల‌ని సంజ‌య్ అనుకున్న‌ప్ప‌టికి వాయిదా ప‌డుతూ వ‌చ్చింద‌ట‌. కాని ఈ సారి మాత్రం ఈ ప్రాజెక్ట్‌ని ప‌క్కాగా సెట్స్ పైకి తీసుకెళ్ళాల‌నే క‌సితో సంజ‌య్ ఉన్నార‌ట‌. మ‌రి గంగూబాయి పాత్ర‌కి సంజ‌య్ ఎవ‌రిని ఎంపిక చేస్తారు, ఆమె పాత్రని ఎంత ప‌వ‌ర్‌ఫుల్‌గా చూపించ‌నున్నాడు, త‌దిత‌ర వివ‌రాలు తెలియాలంటే కొన్నాళ్ళు ఆగ‌క త‌ప్ప‌దు మ‌రి.

1558
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles