అన్నయ్య తర్వాత రవితేజనే: పవన్‌కల్యాణ్

Fri,May 11, 2018 12:49 PM
After my brother its only raviteja says pawankalyan


హైదరాబాద్: టాలీవుడ్ యాక్టర్ రవితేజపై పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ప్రశంసలు కురిపించాడు. నిన్న రవితేజ కొత్త సినిమా నేల టికెట్ ఆడియో లాంఛ్‌కు పవన్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు. నేను నటుడిని కాకముందు సమయాన్ని వృధా చేస్తున్న సమయంలో ఎక్కువగా రవితేజ నటనను చూస్తూ ఉండేవాడిని. ఆజ్ కా గుండారాజ్ (చిరంజీవి హిందీ మూవీ) సినిమా ప్రివ్యూ సమయంలో రవితేజను కలిశా. అన్నయ్య చిరంజీవి తర్వాత నేను అంత దగ్గరగా చూసిన వ్యక్తి రవితేజ. రవితేజ కామెడీ, యాక్టింగ్ వెనుక ఉన్న కష్టం, బాధ తెలుసుకున్న తర్వాత ఆయనపై అభిమానం ఎంతో పెరిగింది. వందల మంది కొత్త వారితో యాక్టివ్‌గా పనిచేయడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. నేను రవితేజలాగా నటించలేను. అందుకే రవితేజ నాకు ఎపుడు ఆదర్శమని ప్రశంసలు జల్లు కురిపించాడు పవన్. కల్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న నేల టికెట్ లో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది.

5924
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles