మ‌రోసారి ఆ ముగ్గురి కాంబినేష‌న్‌లో క్రేజీ ప్రాజెక్ట్

Thu,November 15, 2018 08:59 AM
After Mersal, Vijay, Atlee, AR Rahman reunite for Thalapathy 63

కోలీవుడ్‌లో హిట్ కాంబినేష‌న్స్ రిపీట్ అవ్వ‌డం కామ‌న్‌గా మారింది. త‌ల అజిత్ ద‌ర్శ‌కుడు శివ‌తో ఇప్ప‌టికి నాలుగు సినిమాలు చేశాడు. సూర్య ద‌ర్శ‌కుడు హ‌రితో సింగం సిరీస్‌లు చేస్తూనే ఉన్నాడు. ఇక విజ‌య్ త‌న‌కి మంచి హిట్స్ అందించిన అట్లీతో క‌లిసి త‌న 63వ చిత్రం చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి తాజాగా అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేశారు. విజ‌య్‌తో తెరి, మెర్స‌ల్ అనే చిత్రాల‌ని తెర‌కెక్కించి స్టార్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు అట్లీ. ఇప్పుడు విజ‌య్ 63వ చిత్రాన్ని అట్లీ తెర‌కెక్కించ‌నుండ‌గా, వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందున్న ఈ చిత్రం వారికి హ్యట్రిక్ విజ‌యం త‌ప్ప‌క అందిస్తుంద‌ని అభిమానులు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహ‌మాన్ .. విజ‌య్ , అట్లీ కాంబినేష‌న్‌లో రూపొందిన మెర్స‌ల్ చిత్రానికి స్వ‌రాలు అందించ‌గా, ఇప్పుడు మ‌రోసారి అట్లీ, విజ‌య్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న ప్రాజెక్ట్‌కి సంగీతం స‌మ‌కూర్చ‌నున్నారు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. వ‌చ్చే ఏడాది దీపావళి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

2033
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS