త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో చిరు చిత్రం

Sat,November 17, 2018 11:44 AM
After Koratala Trivikram Directs to Chiru

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం త‌న 151వ చిత్రంగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సైరా అనే చారిత్రాత్మ‌క చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల కానున్న ఈ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. మ‌రి కొద్ది రోజుల‌లో చిత్ర షూటింగ్ పూర్తి కానున్న‌ట్టు తెలుస్తుంది. ఈ మూవీ పూర్తైన వెంట‌నే చిరు.. కొర‌టాలతో క‌లిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు. తాజా స‌మాచారం ప్ర‌కారం అర‌వింద స‌మేత చిత్రంతో మంచి హిట్ కొట్టిన త్రివిక్ర‌మ్.. చిరు వ‌య‌స్సుతో పాటు బాడీ లాంగ్వేజ్‌కి త‌గ్గట్టు ఓ స్క్రిప్ట్‌ని సిద్ధం చేసుకుంటున్నాడ‌ట‌. ఇటీవ‌ల చిరుని క‌లిసి స్టోరీ లైన్ వినిపించ‌గా, దానికి ఇంప్రెస్ అయిన చిరు క‌థ‌ని సిద్ధం చేసుకోమ‌ని చెప్పాడ‌ట‌. అంతా ఓకే అయితే కొర‌టాల మూవీ త‌ర్వాత చిరుని త్రివిక్ర‌మ్ డైరెక్ట్ చేయ‌నున్నాడ‌ని అంటున్నారు. ఈ లోపు త్రివిక్ర‌మ్ మెగా హీరో అల్లు అర్జున్‌తో సినిమా చేసే అవ‌కాశం ఉంద‌ని కూడా తెలుస్తుంది. మ‌రి అతి త్వ‌ర‌లోనే ఈ వార్త‌ల‌కి సంబంధించిన పూర్తి క్లారిటీ రానుంది. మ‌రో వైపు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో సుబ్బిరామిరెడ్డి ఓ భారీ మ‌ల్టీ స్టార‌ర్ నిర్మిస్తాన‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే. చిరు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లుగా రూపొంద‌నున్న ఈ చిత్రం ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాలి.

2198
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles