చేసిన త‌ప్పుకి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన హీరో భార్య‌

Thu,June 20, 2019 09:09 AM
After getting trolled brutally, Tahira Kashyap pens down an apology

రైట‌ర్, డైరెక్ట‌ర్‌, న‌టుడు ఆయిష్మాన్ ఖురానా భార్య త‌హీరా క‌శ్య‌ప్ కొన్నాళ్ళుగా బ్రెస్ట్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆమె కీమో థెర‌పీ చేయించుకుంటుంది. ఇటీవ‌ల త‌న ఒంటిపై ఉన్న క‌త్తి గాట్ల‌తో ఉన్న ఫోటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఒంటిపై ఉన్న ఈ క‌త్తిగాట్లు ఓ గౌర‌వ చిహ్నంగా భావిస్తున్నాను. నేను రోగాన్ని కాకుండా దానిని ధైర్యంగా ఎదుర్కొన్న తీరును చెప్పడానికి ఈ ఫొటోను పోస్ట్ చేశాను అని తహీరా అప్ప‌ట్లో పేర్కొంది. అయితే ఇటీవ‌ల తన మరిదిని హీరోగా పెట్టి.. మ్యూజిక్‌ ఆల్బమ్‌ను తెరకెక్కించిన తహీరా డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సక్సెన్‌ను ఎంజాయ్‌ చేస్తూ తన పిల్లలు, స్నేహితురాలితో పుణె ట్రిప్‌కు వెళ్లారు.

ట్రిప్‌కి వెళ్ళిన త‌హీరా బుద్ధుడిపై కూర్చొని ఫోటోకి ఫోజులిచ్చింది. మంగ‌ళ‌వారం బుద్ధ పూర్ణిమ సంద‌ర్భంగా ఆ ఫోటోని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆమెపై నెటిజ‌న్స్ విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. ఈ నేప‌థ్యంలో ఆ ఫోటోని తొల‌గించిన త‌హీరా.. క్ష‌మాప‌ణ‌లు తెలిపింది. ఎవ‌రి మ‌నోభావాలు దెబ్బ‌తీయాల‌ని అలా చేయ‌లేదు. ఎవ‌రినైన ఇబ్బంది పెట్టిన‌ట్ట‌యితే ద‌య‌చేసి న‌న్ను క్ష‌మించండి. అంద‌రి హృద‌మం ప్రేమ‌, శాంతి భావ‌న‌ల‌తో నిండిపోవాల‌ని త‌న పోస్ట్‌లో పేర్కొంది త‌హీరా. ఈమె 2011లో ఆయుష్మాన్‌ని వివాహం చేసుకోగా ఈ దంప‌తుల‌కి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.

4689
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles