బాహుబ‌లి 2 త‌ర్వాతి స్థానం ప‌ద్మావ‌త్‌దే..!

Thu,February 22, 2018 05:36 PM
after baahubali 2 padmavat in race

ప్రముఖ ద‌ర్శకుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ప‌ద్మావ‌త్‌. రాణి ప‌ద్మావ‌తి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం అనేక వివాదాలు, ప‌లు నిర‌స‌న‌ల మ‌ధ్య జ‌న‌వ‌రి 25న రిలీజ్ అయింది. చిత్ర రిలీజ్‌కి క‌ర్ణిసేన‌తో పాటు రాజ్‌పుత్‌లు కూడా అడ్డుప‌డ‌డంతో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలలో సినిమా రిలీజ్‌కి బ్రేక్ ప‌డింది. అయితే రీసెంట్‌గా శ్రీరాజ్‌పుత్‌ కర్ణి సేన యూట‌ర్న్ తీసుకుంది. చిత్రంపై తాము చేస్తున్న ఆందోళ‌న‌ల‌ను తాము విర‌మించుకున్నట్టు తెలియ‌జేస్తూ, ప‌ద్మావ‌త్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ నేప‌థ్యంలో ప‌ద్మావ‌త్ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గర వ‌సూళ్ల సునామి సృష్టిస్తుంది.ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 500 కోట్ల మార్క్ అందుకుంది. అయితే ఆస్ట్రేలియా బాక్సాఫీస్ ద‌గ్గర కూడా ఈ మూవీ జోరు చూపిస్తుంది. బాహుబ‌లి 2 సినిమా త‌ర్వాత ఆస్ట్రేలియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 3మిలియన్ డాలర్లు క్రాస్ చేసిన సెకండ్ సినిమా పద్మావత్ కావడం విశేషం. బాహుబలి-2 చిత్రం 33లక్షల 50,372 ఆస్ట్రేలియన్ డాలర్స్‌ను రాబట్టగా.. పద్మావత్ 30లక్షల 92,553 డాలర్లను రాబట్టిన‌ట్టు ట్రేడ్ ఎన‌లిస్ట్ తెలిపారు. రానున్న రోజుల‌లో ఈ చిత్రం మ‌రిన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందని విశ్లేష‌కులు చెబుతున్నారు. 1540లో సూఫీ కవి మాలిక్ మొహమ్మద్ జయసీ రాసిన పుస్తకం ఆధారంగా పద్మావత్‌ను తెరకెక్కించారు. రాణి పద్మావతిగా దీపికా పదుకునే నటించగా,ఖిల్జీ పాత్రలో రణ్‌వీర్ నటించాడు. మహారావల్ రతన్ సింగ్ పాత్రను షాహిద్ కపూర్ పోషించిన సంగ‌తి తెలిసిందే.

2563
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles