అల్లు అర్జున్ త‌ర్వాతి ప్రాజెక్ట్‌కి ద‌ర్శ‌కుడు ఎవ‌రో తెలుసా ?

Fri,October 12, 2018 11:19 AM
after Aravindha Sametha, Trivikram all set to join hands with bunny

చివర‌గా నా పేరు సూర్య‌.. నా ఇల్లు ఇండియా అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన బ‌న్నీ.. త‌ర్వాతి సినిమాపై ఇంత వ‌ర‌కు క్లారిటీ ఇవ్వ‌లేదు. ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని, యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీ ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. కాని తాజా స‌మాచారం ప్ర‌కారం బ‌న్నీ నెక్ట్స్ సినిమా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఉంటుందని స‌మాచారం. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన అర‌వింద స‌మేత చిత్రం రీసెంట్‌గా విడుద‌ల కాగా, ఈ మూవీకి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. అల్లు అర్జున్ కూడా స్పెష‌ల్ స్క్రీనింగ్‌లో ఈ సినిమాని వీక్షించాడ‌ట‌. త్రివిక్ర‌మ్ టేకింగ్‌కి ఇంప్రెస్ అయిన బన్నీ వెంట‌నే త్రివిక్ర‌మ్ తో సినిమా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడ‌ట‌. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వరిలో వీరి సినిమా సెట్స్ పైకి వెళ్ళ‌నుండ‌గా, ద‌స‌రాకి రిలీజ్ కానుంది. బ‌న్నీ- త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్‌పై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. త‌మిళంలో వీరం, వేదాళం, వివేగం ,విశ్వాసం సినిమాల ద‌ర్శ‌కుడు శివ ద‌ర్శ‌క‌త్వంలోను బ‌న్నీ ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని స‌మాచారం. క‌పిల్ బ‌యోపిక్‌లోను బ‌న్నీ న‌టిస్తున్నాడ‌ని టాక్.

2105
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles