బాలీవుడ్‌కి వెళ‌తానంటున్న యంగ్ హీరో

Thu,December 27, 2018 08:24 AM
Adivi Sesh  Will be working on Bollywood in 2019

కర్మ మూవీతో యాక్టింగ్ కెరీర్‌ని స్టార్ చేసి, పవన్ కళ్యాణ్ పంజా చిత్రంతో అభిమానుల మనసులు గెలుచుకున్న నటుడు అడవి శేషు. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రంలో భద్ర అనే క్యారెక్టర్‌లో కనిపించి ఫుల్ ఫేమస్ అయ్యాడు. ఇక ఆ తరువాత క్షణం అనే చిత్రంలో హీరోగా నటించి నటుడిగా, రచయితగా అందరి దృష్టిలో పడ్డాడు. ఇటీవ‌ల గూఢ‌చారి అనే చిత్రంతోను అల‌రించాడు. ప్ర‌స్తుతం 2 స్టేట్స్ రీమేక్ చిత్రంతో బిజీగా ఉన్నాడు అడ‌వి శేషు. త్వ‌ర‌లో గూఢ‌చారికి సీక్వెల్ చేయ‌బోతున్న‌ట్టు ఇటీవ‌ల ప్ర‌క‌టించాడు. అయితే తాను తెలుగు భాష‌కే ప‌రిమితం కాకుండా వ‌చ్చే ఏడాది హిందీ భాష‌లో సినిమా చేయాల‌నుకుంటున్న‌ట్టు తెలిపాడు అడ‌వి శేషు. పాన్‌-ఇండియన్‌ సినిమాలతో పాటు కుదిరితే అంతర్జాతీయ సినిమాలు చేయాలనుకుంటున్నా. అటువంటి కథలు రాయాలనుంది అని అడ‌వి శేషు తాజాగా పేర్కొన్నారు. అంటే త్వ‌ర‌లో ఈ యంగ్ హీరోని వేరే భాష‌ల సినిమాల‌లోను చూడ‌నున్నామ‌న్న‌మాట‌.

2093
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles