అప్పుడు అంత‌రిక్షంలో, ఇప్పుడు త‌ర‌గ‌తి గ‌దిలో..

Sat,July 28, 2018 01:51 PM
aditi shares adorable pic

ఘాజీ చిత్రంతో నేష‌న‌ల్ స్టార్‌డం పొందిన డైరెక్టర్ సంక‌ల్ప్ రెడ్డి ప్రస్తుతం వరుణ్‌ తేజ్, అదితిరావు హైద‌రి, లావ‌ణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలలో ఓ స్పేస్‌ థ్రిల్లర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే . ఈ సినిమాలో వరుణ్‌ వ్యోమగామిగా కనిపించేందుకు ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడని సమాచారం. హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పని చేస్తుండగా, విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రంలో ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు. అవడానికి తెలుగమ్మాయే అయినా ముందు బాలీవుడ్ లో పేరు తెచ్చుకుని.. తరువాత మణిరత్నం చెలియా సినిమాలో మెరిసిన అందాల భామ అదితి రావ్ హైద‌రి క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఇటీవ‌ల ఈ అమ్మ‌డు త‌న ట్విట్ట‌ర్‌లో వ‌రుణ్ తేజ్ తో క‌లిసి దిగిన ఫోటో షేర్ చేసింది. ఇందులో స్పేస్ సూట్ వేసుకొని ఉన్నారు ఇద్దరు. ఆ ఫోటోకి ‘‘చందమామను వెంటాడదం.. చుక్కలతో డ్యాన్స్ చేద్దాం.. చంద్రుడిపై మట్టి తీసి తోటి ప్రయాణికులపై చల్లుదాం’’ అంటూ ఫన్నీగా కామెంట్ యాడ్ చేసింది. ఇక తాజాగా త‌ర‌గ‌తి గ‌దిలో దిగిన ఫోటో షేర్ చేసింది.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తమిళనాడులోని రామేశ్వరంలో జరుగుతోంది. భారతరత్న ఏపీజే అబ్దుల్‌కలాం చదివిన పాఠశాలలో, ఆయన చదివిన తరగతిలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. శుక్రవారం కలాం వర్ధంతి కాగా, ఈ రోజున ఆయన చదివిన చోటు తెలుగు సినిమా చిత్రీకరణ జరగడం మనకు గర్వకారణం అంటూ షూటింగ్‌ గ్యాప్‌లో దిగిన ఫొటోని కథానాయిక అదితీరావ్‌ హైదరి సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. అంత‌రిక్షం అనే టైటిల్‌ని చిత్రానికి ప‌రిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. చిత్రంలో మెగా ప్రిన్స్ వరుణ్‌, అదితి రావులు వ్యోమ‌గామిగా కనిపించ‌నున్నారని టాక్. గౌతమీపుత్ర శాతకర్ణి తో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొన్న ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. హాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్లు జిబెక్‌, టొడార్‌ లజరోవ్‌ (జుజి), రోమన్‌ నేతృత్వంలో యాక్షన్‌ సన్నివేశాలు తెరకెక్కించారు.


4799
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS