'స‌మ్మోహ‌నం'లో అదితి రావు హైద‌రి లుక్ ఇలా..!

Wed,May 30, 2018 01:19 PM
Aditi Rao Hydari Shares Her Look From Sammohanam

మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చెలియా చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అయిన బ్యూటీ అదితి రావు హైద‌రి ప్ర‌స్తుతం స‌మ్మోహ‌నం చిత్రంతో టాలీవుడ్ డెబ్యూ ఇస్తుంది. సుధీర్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం ఇంద్ర‌గంటి మోహ‌న్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది. అదితి చివ‌రిగా సంజయ్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కించిన ప‌ద్మావ‌త్ చిత్రంలో న‌టించింది. స‌మ్మోహ‌నం చిత్రంతో అదితికి మంచి పేరు వ‌స్తుంద‌ని టీం చెబుతుంది. ఈ అమ్మ‌డు తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఆఫ్ స్క్రీన్‌లో దిగిన ఫోటోని షేర్ చేసింది. ఈ పిక్ అభిమానుల‌ని అల‌రిస్తుంది. శ్రీదేవి మూవీస్‌పై బేన‌ర్‌పై శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ నిర్మించిన సమ్మోహ‌నం చిత్రం జూన్ 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాతో త‌న‌కి తెలుగులో మ‌రిన్ని ఆఫర్స్ వ‌స్తాయ‌ని భావిస్తుంది. అదితి రావు హైద‌రి త్వ‌ర‌లో తెర‌కెక్క‌నున్న వ‌రుణ్ తేజ్ సినిమాలోను న‌టించనుంద‌ని టాక్. సంక‌ల్ప్ రెడ్డి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు.

2902
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles