మ‌ల్టీ స్టార‌ర్ చిత్రంలో హీరోయిన్స్ వీరేనా ?

Tue,April 16, 2019 08:23 AM
Aditi Rao Hydari , Nivetha Thomas acts in multi starrer

ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శక‌త్వంలో నాని, సుధీర్ బాబు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఓ మల్టీ స్టార‌ర్ తెర‌కెక్కుతుంద‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుండ‌గా, త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ట‌. చిత్రానికి సంబంధించి కొద్ది రోజులుగా అనేక వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా మ‌ల్టీస్టార‌ర్ చిత్రంలో నాని సరసన నాయికగా అదితీ రావ్ హైదరీని .. సుధీర్ బాబు జోడీగా నివేదా థామస్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. దిల్ రాజు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. వ్యూహం అనే టైటిల్‌ని చిత్రానికి ప‌రిశీలిస్తున్నార‌ట‌. చిత్రంలో నాని పాత్ర కొద్ది సేప‌టికే ఉన్న‌ప్ప‌టికి చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంద‌ట‌. ఈ చిత్రంతో తొలిసారి నెగెటివ్ పాత్ర చేయ‌బోతున్నాడు నాని. సుధీర్ బాబు పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నువిందు చేయ‌నున్నాడ‌ట‌. జూలైలో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ మూవీ డిసెంబ‌ర్‌లో రిలీజ్ కానుంద‌ట.

1487
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles