పందిపిల్ల‌తో డ్యాన్స్ చేయించిన ర‌విబాబు

Sat,September 8, 2018 10:31 AM
Adhugo Movie Teaser released

క్రియేటివ్ డైరెక్ట‌ర్ ర‌విబాబు కాస్త డిఫరెంట్ గా ఆలోచించి పంది పిల్లపై అదుగో అనే పేరుతో సినిమా తీసిప‌ సంగ‌తి తెలిసిందే. ద‌స‌రా శుభాకాంక్ష‌ల‌తో చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని భావించిన ర‌విబాబు సినిమాకి సంబంధించి వినూత్న ప్ర‌మోష‌న్స్ చేస్తున్నాడు. ఇటీవ‌ల సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేస్తూ `హాయ్‌.. మై నేమ్ ఈజ్ బంటీ` అంటూ పందిపిల్ల ఫోటోతో పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్ అల‌రించింది. ఇక తాజాగా టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో సోఫా వెనుక‌ దాక్కున్న బంటిని బ‌య‌ట‌కి పిలిచి ప‌లు విన్యాసాలు చేయించారు. కింద కూర్చోవ‌డం, రోల్ అవ్వ‌డం, వెరైటీగా డ్యాన్స్ చేయించ‌డం వంటివి చేసింది బంటి. సెప్టెంబ‌ర్ 12న చిత్ర ట్రైల‌ర్‌ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు టీజ‌ర్ ద్వారా తెలిపారు. ఇండియ‌న్ సినిమా చ‌రిత్రలోనే తొలి సారి పూర్తిస్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేష‌న్‌తో రూపొందుతున్న ఈ సినిమాని రవిబాబు స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ ఫ్లైయింగ్‌ ఫ్రాగ్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అభిషేక్, నాభ లు చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి నిర్మాత సురేష్ బాబు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తెలుగుతో పాటు అన్ని భారతీయ భాషల్లో ఈ చిత్రం విడుద‌ల కానుంది. ప్ర‌శాంంత్ విహారీ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు, సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు.

2602
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles