పందిపిల్లతో తీసిన సినిమా రిలీజ్ ఎప్పుడంటే ?

Sun,August 19, 2018 10:43 AM
Adhugo  movie release date confirmed

అల్ల‌రి, అనసూయ‌, అవును వంటి డిఫరెంట్ కామెడి, ల‌వ్‌, హ‌ర్ర‌ర్‌, సస్పెన్స్ థ్రిల్ల‌ర్ చిత్రాల‌ను ప‌రిమిత బ‌డ్జెట్‌లో తెర‌కెక్కించి డైరెక్ట‌ర్‌గా త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ద‌ర్శ‌కుడు ర‌విబాబు. ఒక వైపు ముఖ్య పాత్రలలో నటిస్తూ మరో వైపు తన దర్శకత్వ ప్రతిభను చాటుకుంటున్నాడు . ప్రస్తుతం తాను కాస్త డిఫరెంట్ గా ఆలోచించి పంది పిల్లపై అదుగో అనే పేరుతో సినిమా తీసాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తైన ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వ‌డం లేదు. ఆ మ‌ధ్య ప‌లు సంద‌ర్భాల‌లో పందిపిల్ల‌తోనే బ‌య‌ట క‌నిపించిన ర‌విబాబు, ఇటీవ‌ల పంది పిల్ల పళ్లుతోముతూ కనిపించారు. ఆ త‌ర్వాత పందిపిల్లను వీపుపై కూర్చోబెట్టుకుని పుషప్స్ చేస్తున్న వీడియో విడుద‌ల చేశాడు. ఫిట్‌నెస్ కోసం బంటి కూడా వ్యాయామం చేస్తోందని, మరి మీరెందుకు చేయరని ప్రశ్నించాడు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని సినీ ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, ద‌స‌రా కానుక‌గా ఈ మూవీని విడుద‌ల చేయాల‌ని ర‌విబాబు భావిస్తున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న కూడా చేయ‌నున్నాడ‌ని తెలుస్తుంది. రవిబాబు స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ ఫ్లైయింగ్‌ ఫ్రాగ్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అభిషేక్, నాభ లు చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు.


4237
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles