నాని జెర్సీ 'అదేంటో గాని ఉన్నపాటుగా' సాంగ్ టీజర్

Thu,March 21, 2019 06:07 PM
Adhento Gaani Vunnapaatuga Song Teaser from nani Jersey movie

వ‌రుస సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌కి థ్రిల్ క‌లిగించే నాని ప్ర‌స్తుతం జెర్సీ, గ్యాంగ్ లీడ‌ర్ చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. జెర్సీ చిత్రం మ‌ళ్ళీ రావా ఫేం గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 19న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు గ‌తంలో ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. అయితే మ‌హేష్ మూవీ మ‌హ‌ర్షి రిలీజ్ ఎప్పుడైతే ఏప్రిల్ నుండి మే కి షిఫ్ట్ అయిందో అప్పటి నుండి నాని సినిమా రిలీజ్ డేట్ కూడా మారుతుంద‌ని ప్ర‌చారం జ‌ర‌గింది. కాని ఏప్రిల్ 19న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్న‌ట్టు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు మేక‌ర్స్.

ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయిక. అనిరుధ్ రవిచందర్ స్వరాల్ని సమకూర్చుతున్నారు. జెర్సీ సినిమాలో నాని అర్జున్ అనే క్రికెటర్ పాత్రను పోషిస్తున్నారు. 36ఏళ్ల వయసులో అర్జున్ క్రికెట్‌లో తన లక్ష్యాన్ని ఎలా సాధించాడు? ఈ క్రమంలో అతని జీవితంలో ఎదురైన పరిస్థితులేమిటన్నది ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని చిత్రబృందం తెలిపింది. 1996-97 రంజీట్రోఫీ క్రికెట్ నేపథ్యంలో ఈ చిత్ర కథ నడుస్తుంది. సత్యరాజ్, రోనిత్‌కర్మ, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌గా సను వర్గీస్ ప‌నిచేస్తున్నారు.

ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్, అదేంటో గాని ఉన్నపాటుగా పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. తర్వాత స్పిరిట్ ఆఫ్ జెర్సీ పేరుతో రెండో పాటను విడుదల చేసిన చిత్ర బృందం.. తాజాగా అదేంటో గాని ఉన్నపాటుగా పాట టీజర్‌ను రిలీజ్ చేసింది.

1572
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles