న్యూస్ పేప‌ర్ డ్రెస్ ధ‌రించిన ఆదా.. వైర‌ల్ అవుతున్న ఫోటో

Fri,February 22, 2019 08:16 AM
Adah Sharmas newspaper dress is viral in internet

హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన ఆదాశ‌ర్మ ఎప్పుడు ఏదో ఒక యాక్టివిటీతో వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. అప్ప‌ట్లో కికి ఛాలెంజ్ కి సంబంధించిన వీడియోతో పాటు బెల్లీ డ్యాన్స్ వీడియోల‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వావ్ అనిపించింది. ఇటీవ‌ల‌ మ‌ధ్యం తాగితే వ‌చ్చే అన‌ర్ధాల‌ని వివ‌రిస్తూ ఓ వీడియో చేసింది. ఈ వీడియోకి సూప‌ర్భ్ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఫెమీనా బ్యూటీ అవార్డ్స్ 2019 కార్యక్రమానికి వెరైటీ డ్రెస్‌లో వెళ్లి అంద‌రి దృష్టిని ఆకర్షించింది. ఆదా శ‌ర్మ ధ‌రించిన డ్రెస్ న్యూస్ పేప‌ర్ త‌ర‌హాలో ఉండ‌గా, దీనిని ప్ర‌ముఖ డిజైన‌ర్‌ ఫయాజ్ జరీవాలా డిజైన్ చేశారు. న్యూస్ పేపర్ డ్రెస్ లో ఎంతో విలక్షణంగా ఉన్న ఆదాశ‌ర్మ‌ని చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఆదా పోస్ట్ చేసిన ఫోటోల‌కి ల‌క్ష‌కి పైగా లైకులు వ‌చ్చాయి.

ప్ర‌స్తుతం ఆదాశ‌ర్మ‌ ప‌లు బాలీవుడ్ సినిమాల‌తో పాటు హ‌లీవుడ్ సినిమా చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. తెలుగులో అ మూవీ ఫేం ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న క‌ల్కిలో న‌టిస్తుంది. రాజ‌శేఖ‌ర్ ప్రధాన పాత్ర‌లో రూపొందుతున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.క‌మాండో 3లోను ఆదాశ‌ర్మ న‌టిస్తుండ‌గా, ఇటీవ‌లే త‌న పార్ట్‌కి సంబంధించిన చిత్ర షూటింగ్ పూర్తైంది. ఇక ప్ర‌భుదేవా న‌టిస్తున్న చార్లీ చాప్లిన్ 2 చిత్రంతో తమిళ తెర‌కి ప‌రిచ‌యం కానుంది.

2375
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles