అంద‌విహీనంగా ఆదాశ‌ర్మ‌.. మీ కామెంట్ ఏంటి?

Tue,July 16, 2019 11:35 AM
Adah Sharma pranks her fans with her unique look

అందాల ఆదాశ‌ర్మ గుర్తు ప‌ట్ట‌లేనంత అందవిహీనంగా మారింది. అంతేకాదు ఆమె ఫోటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఎవ‌రో గుర్తు ప‌ట్టండి అనే కామెంట్ కూడా పెట్టింది. ఈ ఫోటోలో ఆదా శ‌ర్మ ఎత్తు ప‌ళ్ళ‌తో పొట్ట వేసుకొని పిజ్జా తింటుంది. దీనిపై నెటిజ‌న్స్ వెరైటీ కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి పిజ్జా ముఖం నీకు తప్ప ఎవరికీ లేదు అది ఆదాశ‌ర్మ‌నే అని ఓ నెటిజ‌న్ కామెంట్ పెట్ట‌గా, ఫ్యూచ‌ర్ లుక్ ఇదే అంటూ మ‌రో నెటిజ‌న్ కామెంట్ రాసాడు. ఎప్పుడు సెక్సీగా కనిపించే ఆదాశ‌ర్మ ఇలా క‌నిపించే స‌రికి ఆమె అభిమానులు మాత్రం జీర్ణించుకోలేక‌పోతున్నారు.

ఆదాశ‌ర్మ సినిమాల‌తో క‌న్నా తాను చేసే ప‌లు యాక్టివిటీస్‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. 2008 లో వచ్చిన హిందీ హర్రర్ చిత్రం “1920” తో హీరోయిన్ గా పరిచయం అయిన ఆదా.. తెలుగు ప్రేక్ష‌కుల‌కి హార్డ్ ఎటాక్ చిత్రంతో ద‌గ్గ‌రైంది. “సన్ ఆఫ్ సత్యమూర్తి”,”క్షణం” వంటి హిట్ చిత్రాలలో నటించిన ఆదా శ రీసెంట్‌గా రాజశేఖర్ హీరోగా వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ “కల్కి” చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా కనిపించారు. ప్రస్తుతం ఆదా శర్మ “మాన్ టు మాన్” అనే బాలీవుడ్ చిత్రంలో ట్రాన్స్ జెండర్ రోల్ చేస్తుంది. మగాడిగా పుట్టిన ఒక వ్యక్తి లింగమార్పిడి చికిత్స ద్వారా స్త్రీగా మారి, మరొక మగాడికి ప్రేమించి, పెళ్లి చేసుకున్న తర్వాత ఏం జరిగింది? తనను పెళ్లాడిన వ్యక్తి అసలు విషయం తెలిసిన తర్వాత ఎలా రియాక్ట్ అయ్యాడు? ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి? అనేది రొమాంటిక్ కామెడీ స్క్రీన్ ప్లేతో చూపించబోతున్నారు. ఈ చిత్రానికి అబిర్ సేన్‌గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు.

2285
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles