9 వేళ్ళు ఉన్నా కూడా నన్ను ప్రేమిస్తారుగా..!

Sun,September 9, 2018 08:09 AM
Adah Sharma finger injured in shooting

హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అందాల నటి ఆదాశర్మ. ఈ అమ్మడు సినిమాల కన్నా తన యాక్టివిటీస్ తో అందరి దృష్టి ఆకర్షిస్తుంది. సన్ ఆఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, క్షణం చిత్రాలలో తన నటనతో మెప్పించిన ఆదా సోషల్ మీడియాలో వెరైటీ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంటుంది. ఇటీవల కికి ఛాలెంజ్ కి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వావ్ అనిపించింది. ప్ర‌స్తుతం కమాండో ఫ్రాంచైజీలో రూపొందుతున్న థర్డ్‌ పార్ట్ క‌మాండో 3లో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. విద్యుత్ జ‌మాల్ హీరోగా న‌టిస్తున్నారు. అయితే ఓ యాక్ష‌న్ సీక్వెన్స్‌లో భాగంగా కార్‌డోర్ క్లోజ్ చేయ‌బోయే స‌మ‌యంలో ఆదా వేలు డోర్ మ‌ధ్య‌లో ప‌డింది. దీంతో వేలికి గాయమైంది. ర‌క్తం బాగా పోతున్న కూడా లొకేష‌న్‌లోనే ఫ‌స్ట్ ఎయిడ్ చేయించుకొని షూటింగ్‌లో పాల్గొంది. అయితే త‌న‌కి గాయ‌మైన విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసిన ఆదా శ‌ర్మ నాకు తొమ్మిది వేళ్ళున్న కూడా ఇంత‌క ముందులా ల‌వ్ చేస్తారుగా అంటూ అమాయ‌కంగా అడిగింది. దేవుడి దయ వల్ల మిగిలిన వేలు కూడా ఇంకా నా బాడీలో భాగమై ఉన్నందుకు సంతోషం అని పేర్కొంది అదా శర్మ. టాలీవుడ్ కి బైబై చెప్పిన ఆదాశర్మ ప్రస్తుతం బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అయితే ఈ అమ్మడికి రీసెంట్ గా హాలీవుడ్ లో నటించే బంపర్ ఆఫర్ ఒకటి వచ్చిందట. ఆ సినిమాలో ఆదా డీ గ్లామర్ లుక్ లోనే కనిపించాల్సి ఉందట. ఇందుకు సంబంధించి ముతక చీరలో ఉన్న ఆదా శ‌ర్మ ఫోటోలు ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.9509
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS