కాంగ్రెస్‌లో చేరిన నటి ఊర్మిళ మటోండ్కర్

Wed,March 27, 2019 02:34 PM
Actress Urmila Matondkar joined Congress party


న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్ కాంగ్రెస్‌లో చేరారు. ఇవాళ న్యూఢిల్లీలోని నివాసంలో రాహుల్‌గాంధీని ఊర్మిళ కలిశారు. ఊర్మిళకు రాహుల్ కండువా అందించి పార్టీలోకి ఆహ్వానించారు. ఊర్మిళ వెంట మహారాష్ట్ర విభాగం కాంగ్రెస్ చీఫ్ మిలింద్ డియోరా, సీనియర్ నేత సంజయ్ నిరూపమ్ ఉన్నారు. ఊర్మిళ ముంబై నార్త్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి కాంగ్రెస్ ఓ ప్రకటన వెలువరించనున్నట్లు తెలుస్తోంది. ముంబై నార్త్ నుంచి పోటీ చేసేందుకు ఊర్మిళ ఆసక్తి చూపుతున్నారని, దీనిపై తుదినిర్ణయం పార్టీ తీసుకుంటుందని పార్టీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

1053
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles