జిమ్‌లో స్నేహ‌ హార్డ్ వ‌ర్క్ చూశారా..!

Sat,March 17, 2018 09:37 AM
actress sneha zym video

ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో కుటుంబ క‌థా చిత్రాల‌లో ఎక్కువ‌గా న‌టించి తెలుగింటి సీత‌మ్మ‌గా పేరు తెచ్చుకుంది స్నేహ‌. గ్లామ‌ర్‌తో పాటు ఫ్యామిలీ చిత్రాల‌తో అల‌రించిన స్నేహ‌కి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కోలీవుడ్ న‌టుడు ప్ర‌సన్న‌ని వివాహం చేసుకున్న త‌ర్వాత స్నేహ పెద్ద‌గా సినిమాలు చేయ‌లేదు. అప్పుడ‌ప్పుడు స్పెష‌ల్ రోల్స్ లో తళుక్కున మెరిసిన ఈ అందాల భామ రామ్ చ‌ర‌ణ్‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న చిత్రంలో వ‌దిన‌గా న‌టించ‌నుంద‌ట‌. ఈ పాత్ర సినిమాకి చాలా కీల‌కం అని తెలుస్తుంది. అయితే ఈ సినిమా ద్వారా త‌న క్రేజ్ మ‌రింత పెంచుకోవాల‌ని భావిస్తున్న స్నేహ జిమ్‌లో గంట‌ల త‌ర‌బ‌డి వ‌ర్క‌వుట్స్ చేస్తుంది. త‌న భ‌ర్త ప్ర‌స‌న్న ద‌గ్గ‌రుండి మ‌రీ ఆమెతో వ‌ర్క‌వుట్స్ చేయిస్తున్నాడు. జిమ్ వీడియోని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన స్నేహ‌..కొత్త జర్నీ స్టార్ట్ చేశాను, చేర‌కోవ‌ల‌సిన గ‌మ్యం చాలా దూరం ఉంది అనే కామెంట్ పెట్టింది. ప్ర‌స్తుతం స్నేహ జిమ్ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది.

beginning of a new journey😃😃have a looooong way to go

A post shared by Sneha Prasanna (@realactress_sneha) on

2976
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS