అత్త పాత్ర‌లో అల‌రించనున్న అందాల భామ‌..!

Wed,April 11, 2018 12:56 PM
actress simran palys different role in telugu

ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా చ‌లామ‌ణీ అయిన అందాల భామ‌లు పెళ్ళి త‌ర్వాత సినిమాల‌కి దూర‌మ‌వుతూ వ‌చ్చారు. వారి పూర్తి టైంనే కుటుంబానికి కేటాయించి ఇండ‌స్ట్రీకి బైబై చెప్పేశారు. అయితే కొంత గ్యాప్ త‌ర్వాత ఆనాటి అందాల భామ‌లు రీఎంట్రీ ఇచ్చి స‌త్తా చాటుతున్నారు. అక్క‌, అత్త‌, వ‌దిన పాత్ర‌ల‌లో న‌టించేందుకు సై అంటున్నారు. ఈ నేప‌థ్యంలో వారికి వ‌రుస ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. ఇటీవ‌ల‌ భూమిక నానికి వ‌దినగా న‌టించి మెప్పించింది. ఇక తాజాగా సిమ్రాన్ అత్త పాత్ర‌తో అల‌రిస్తానంటుంది. చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్ వంటి స్టార్స్‌తో న‌టించిన సిమ్రాన్ తన అందచందాలతో, వైవిధ్యమైన నటనతో కుర్ర కారు గుండెల్లో రైళ్ళు పరుగులెత్తించింది. ఈ మ‌ధ్యే త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌కి రీ ఎంట్రీ ఇచ్చింది.

సిమ్రాన్ కొన్నాళ్లుగా వెండితెరపై అంతగా సందడి చేయడం లేదు. అడపాదడపా కొన్ని సినిమాలు చేస్తున్నప్పటికి వాటితో అంతగా గుర్తింపు రాలేదు. తమిళ డైరెక్టర్ పొణరామ్ .. శివకార్తికేయన్, సమంత ప్రధాన పాత్రలలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సిమ్రాన్ ని విలన్ గా చూపించనున్నాడని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. ఈ పాత్ర కోసం సిమ్రాన్ తమిళ్‌ మార్టియల్ ఆర్ట్ సీలంబమ్ (కర్రసాము) కూడా నేర్చుకుంటుందట. సిమ్రాన్ కి జోడిగా మలయాళ నటుడు లాల్ నటిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల తెలుగు సినిమాకి కూడా ఓకే అంద‌ట స‌ల్మాన్‌. సప్తగిరి హీరోగా ఈశ్వర్ రెడ్డి ఓ సినిమా తెర‌కెక్కించ‌నున్నాడు. ఇది అత్తకి తగిన అల్లుడు తరహాలో కొనసాగే కథగా తెలుస్తుంది. ఇందులో సిమ్రాన్ అత్త‌గా న‌టిస్తుంద‌ట సిమ్రాన్. వినోదమే ప్రధానంగా సాగే ఈ సినిమాలో సిమ్రాన్ పాత్ర‌కి మంచి గుర్తింపు ఉంటుంద‌ట‌. అందుకే సిమ్రాన్ ఈ సినిమాకి సైన్ చేసింద‌ని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

3893
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS