శ్రీవారి సేవలో సినీనటి సమంత అక్కినేని

Sun,August 5, 2018 11:46 AM
Actress Samantha Akkineni visits Tirumala

తిరుప‌తి: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని ప్రముఖ సినీనటి సమంత అక్కినేని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో సమంత స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శ‌న‌ ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో సమంతకు ఆలయ అర్చకులు వేదశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి, సమంతను పట్టువస్త్రంతో సత్కరించారు. తిరుమల అంటే చాలా ఇష్టమైన ప్రదేశం అని ఈ సంద‌ర్భంగా సమంత అన్నారు. స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. తిరుమల స్వామి వారిని దర్శించుకోవడానికి మళ్లీ మ‌ళ్లీ తిరుమలకు వస్తానని ఆమె అన్నారు.

2475
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles