తప్పుగా ప్రవర్తించిన దర్శకుడిని చెప్పుతో కొట్టా..

Tue,October 23, 2018 03:36 PM
Actress mumtaz slapped director with a slipper

గత కొన్ని రోజులుగా మీటూ ఉద్యమం రోజురోజుకీ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ హీరోయిన్లు తమకు ఎదురైన వేధింపుల విషయాన్ని బయటపెట్టారు. తెలుగులో పవన్‌కల్యాణ్ నటించిన ఖుషి, అత్తారింటికి దారేది, మహేశ్‌బాబు నటించిన ఆగడు చిత్రాల్లో కనిపించిన నటి ముంతాజ్ తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పింది.

కెరీర్ ప్రారంభ దశలో తాను ఎదుర్కొన్న పరిస్థితులను, వాటి నుంచి తప్పించుకున్న తీరును చెప్పింది ముంతాజ్. ఓ దర్శకుడు నాతో తప్పుగా ప్రవర్తిస్తే..అతన్ని చెప్పుతో కొట్టాను. మరో దర్శకుడు కూడా అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఈ విషయాన్ని నడిగర్ సంఘానికి ఫిర్యాదు చేశా. వారు నా సమస్యను తీర్చారు. అప్పటి నుంచి ఆ దర్శకుడు నా పట్ల చాలా మర్యాదగా ప్రవర్తిస్తున్నాడని చెప్పింది ముంతాజ్.

2463
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS