అలనాటి నటి కృష్ణకుమారి కన్నుమూత

Wed,January 24, 2018 10:21 AM
అలనాటి నటి కృష్ణకుమారి కన్నుమూత


బెంగళూరు : అలనాటి ప్రముఖ నటి కృష్ణకుమారి కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్ తో బాధపడుతున్న కృష్ణకుమారి బెంగళూరులోని నివాసంలో ఇవాళ తుదిశ్వాస విడిచారు. కృష్ణకుమారి 1933 మార్చి 6న పశ్చిమబెంగాల్‌లో జన్మించారు. 1951లో నవ్వితే నవరత్నాలు సినిమాతో చిత్రసీమకు పరిచయమైన కృష్ణకుమారి.. 110 సినిమాల్లో నటించారు.

పల్లెపడుచు, పాతాళభైరవి, బంగారు పాప చిత్రాలతో కృష్ణకుమారి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో దేవాంతకుడు, భార్యాభర్తలు, కులగోత్రాలు, ఇలవేల్పు, వినాయక చవితి, వీర కంకణం, పెళ్లి కానుక, నిత్యకల్యాణం పచ్చ తోరణం, వాగ్దానం, లక్షాధికారి, పునర్జన్మ వంటి హిట్ చిత్రాలతోపాటు కన్నడ, తమిళ, మలయాళ చిత్రాల్లోనూ నటించారు. ఉమ్మడి కుటుంబం, భువన సుందరి కథ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్నారు.

మూడుసార్లు జాతీయ అవార్డులు..
కృష్ణకుమారి మూడు సార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. రాష్ట్ర్రస్థాయిలో పలు నంది అవార్డులతోపాటు కాంచనమాల, సావిత్రి, ఎన్టీఆర్ అవార్డులు అందుకున్నారు. కృష్ణ కుమారిని బ్రిటన్ లోని బర్మింగ్ హాం సంస్థ జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించింది. కృష్ణ కుమారి అలనాటి అగ్రనటులు ఎన్టీఆర్, ఏఎన్ ఆర్, కాంతారావు, కృష్ణంరాజు, జగ్గయ్య, హరనాథ్ తో కలిసి నటించారు. రెండు దశాబ్దాలపాటు చిత్రసీమలో కొనసాగిన కృష్ణకుమారి సినిమాల్లో నటించడం ఆపేశాక బెంగళూరులో స్థిరపడ్డారు.

2336

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS

Union Budget 2018