తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటి కాజల్

Sun,April 8, 2018 10:10 AM

తిరుమల: తిరుమల శ్రీవారిని సినీనటి కాజల్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో ఆమె శ్రీవారి మూలవిరాట్టును దర్శించుకొని మ్రొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అదికారులు కాజల్ కు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్ధప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు. స్వామి వారిని దర్శించుకోవడం చాల ఆనందంగా ఉందని కాజల్ అన్నారు. తను ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్, శర్వానంద్ లతో,తమిళంలో క్వీన్ చిత్రం రీమేక్ లో నటిస్తున్నట్లు నటి కాజల్ తెలిపారు.

4095
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles