నటి భావన పెళ్లి వీడియో వచ్చేసింది

Wed,January 24, 2018 10:47 AM
ACTRESS BHAVANA wedding video

2008లో గోపిచంద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఒంటరి సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన భావన తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితమే. తెలుగులో అంతగా రాణించకపోయిన తమిళం, మలయాళంలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే రీసెంట్ గా కన్నడ ఫిలిం ప్రొడ్యూసర్ నవీన్ ని వివాహం చేసుకున్న భావన తన మ్యారేజ్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. నిన్న మెహందీ వీడియోని విడుదల చేసిన భావన తాజాగా వెడ్డింగ్ వీడియో విడుదల చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎంతో గ్రాండ్ గా జరిగిన భావన పెళ్ళికి మలయాళ సినీ ఇండస్ట్రీ మొత్తం హాజరైంది. మమ్ముట్టి, టోవినో థామస్, మంజు వారియర్, పృద్వీరాజ్ తదితరులు పెళ్ళికి హాజరై వధూవరులని ఆశీర్వదించారు. పెళ్ళి, రిసెప్షన్ కి సంబంధించి బ్యూటీ ఫుల్ మూమెంట్స్ ని నాలుగున్నర నిమిషాల వీడియోగా రూపొందించి విడుదల చేశారు. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.


2375
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS