అర్చ‌న వెడ్డింగ్ రిసెప్ష‌న్ ఫోటోలు

Fri,November 15, 2019 12:25 PM

సినీ న‌టి అర్చ‌న వివాహం హెల్త్‌కేర్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ జగదీశ్‌తో ఘ‌నంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. గురువారం( న‌వంబ‌ర్ 14) తెల్లవారుజామున 1:30 ని.ల‌కి మూడుముళ్ల బంధంతో అర్చన,జగదీశ్‌లు ఒక్క‌టి కాగా, వీరి పెళ్ళి వేడుక‌లో ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు సంద‌డి చేశారు. ఓంకార్, ముర‌ళి మోహ‌న్, శివ బాలాజీ, అలీ, సుబ్బిరామి రెడ్డి, ప‌ర‌చూరి గోపాల కృష్ణ త‌దిత‌రులు నూత‌న జంట‌కి ఆశీర్వాదం అందించారు. ఇక పెళ్ళికి కొద్ది స‌మ‌యం ముందు రిసెప్షన్ వేడుక నిర్వ‌హించారు. గచ్చిబౌలిలోని కొల్లమాధవరెడ్డి గార్డెన్‌లో అర్చ‌న వివాహం జ‌రిగింది. అక్టోబ‌ర్ 3న హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో అర్చ‌న‌.. జగదీశ్‌తో నిశ్చితార్ధం జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే.తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి సుమారుగా 40 సినిమాల్లో న‌టించిన అర్చ‌న చివ‌రిగా ‘వజ్ర కవచధర గోవింద’ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తాజాగా అర్చ‌న పెళ్లి, రిసెప్ష‌న్‌కి సంబంధించిన ఫోటోలు బ‌య‌ట‌కి వ‌చ్చాయి.










4575
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles