సంగీత్ వేడుక‌లో అర్చ‌న‌, జ‌గ‌దీష్‌ల ఆట‌పాట‌

Tue,November 12, 2019 08:18 AM

న‌టిగానే కాకుండా, బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా తెలుగు ప్రేక్ష‌కుల మన‌సులు దోచుకున్న భామ అర్చ‌న వేద. ఈ అమ్మడు అక్టోబ‌ర్ 3న హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో ప్రముఖ వ్యాపారవేత్త జగదీశ్‌తో నిశ్చితార్ధం జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. నవంబర్ 13 తెల్ల‌వారుజామున 1.30ని.ల‌కి హైదరాబాద్‌లో వీరి వివాహం ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో సోమవార రాత్రి సంగీత్ వేడుక ఘ‌నంగా నిర్వ‌హించారు. పెళ్లి వేడుక జరిగే గచ్చిబౌలిలోని కొల్లమాధవరెడ్డి గార్డెన్‌లోనే సంగీత్ కార్యక్రమాన్ని నిర్వ‌హించ‌గా, వ‌ధూవ‌రులు అర్చ‌న‌, జ‌గ‌దీష్‌ల‌తో పాటు శివ‌బాలాజీ, మ‌ధుమిత త‌దిత‌రులు త‌మ ఆట‌పాట‌ల‌తో సంద‌డి చేశారు.


2004లో ‘తపన’ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అర్చ‌న‌. ఆ త‌రువాత ప‌లు తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ సినిమాల‌లో న‌టించింది. నేను సినిమా ఆమెకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలో త్రిష స్నేహితురాలిగా నటించి మెప్పించారు అర్చ‌న‌. ఇక అప్పటి నుంచి హీరోయిన్ పాత్రలే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ రాణించారు. ‘శ్రీరామదాసు’, ‘పౌర్ణమి’, ‘యమదొంగ’, ‘ఖలేజా’, ‘బలుపు’ వంటి భారీ చిత్రాల్లో అర్చన నటించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి సుమారుగా 40 సినిమాల్లో నటించారు. ఆమె ఆఖరిగా నటించిన చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’.

1258
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles