తెలుగు డబ్బింగ్ కు 46 రోజులు : సూర్య

Sun,January 7, 2018 10:24 PM
Actor surya take 46 days for Telugu dubbing to gang movie


హైదరాబాద్ : కోలీవుడ్ యాక్టర్ సూర్య నటిస్తోన్న తాజా చిత్రం గ్యాంగ్. సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సూర్య తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్య్వూలో డబ్బింగ్ విషయమై సూర్య మాట్లాడుతూ ఈ సినిమాలో నా డైలాగులన్నీ కొత్త పంథాలో ఉంటాయి. అందుకే నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నా. డబ్బింగ్‌ చెబుతున్నప్పుడు చాలా ఆస్వాదించా. తెలుగు భాష గొప్పదనం తెలిసింది. త‌మిళంలో డ‌బ్బింగ్ చెప్పటానికి 8 రోజులు స‌మ‌యం ప‌డితే.. తెలుగులో మాత్రం 46 రోజులు ప‌ట్టింది. భ‌విష్యత్ లో తాను తెలుగు ఇంకా బాగా నేర్చుకుంటానని విశ్వాసం వ్యక్తం చేశాడు సూర్య. విఘ్నేశ్ శివమ్ డైరెక్షన్ లో వస్తు్న ఈ చిత్రంలో కీర్తిసురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. హిందీలో వచ్చిన స్పెషల్ ఛబ్బీస్ మూవీకి ఇది రీమేక్.

3428
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles